Vinave Naa Vinati | వినవే నా వినతి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.49 - సాయంతనారాధన సాయంతన సమర్పణము
వినవే నా వినతి నివేదన దయ- వెలయగ నో ప్రభువా= నిను
శరణాందితి నను గుశలంబున- నునుపవె యో ప్రభువా
॥ వినవే ॥
1. నిర్మల గతి సంధ్యా కాలంబున- నీ స్తవ మగు ప్రభువా= ధర్మదీప్తి
నా కొసగి చేయు-దీప్తవంతునిగ నన్ను
॥ వినవే ॥
2. నీ మహాదాశ్రయ మొసంగి దుర్గతిని- నేబడకుండగను= నామది
తన్వాది సమస్తముతో-ననుగావవె ప్రభువా
॥ వినవే ॥
3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ-కన్న వేరే గలవా= పన్నుగ మది నీ
పదసంగతమై- యున్నది రేపగలు
॥ వినవే ॥
4. పాప కరుండను నే సుకృతా-పాది కర్మ మెఱుగ = నీ పాద సరోజము
నాకొసగుము- నాపై నీ కృపజెలగ
॥ వినవే ॥
5. నీ కొరకై నామనము దృఢంబౌగాక యేసుప్రభువా= నాకు
బిశాచముచే భ్రమ జన్మము-గాకుండగ నేలు
॥ వినవే ॥
––మిక్కిలి సమూయేలు
Vinave naa vinati nivedana daya-velayaga no Prabhuvaa= Ninu
Sharanaanditi nanu gushalambuna-nunupave yo Prabhuvaa
|| Vinave ||
1. Nirmala gati sandhyaa kaalambuna-nee stava magu Prabhuvaa= Dharma deepti
naa kosagi cheyu-deeptavantuniga nannu
|| Vinave ||
2. Nee mahaadaashraya mosangi durgatini-ne badakundaganu= Naamadi
tanvaadi samastamuto-nanugaavave Prabhuvaa
|| Vinave ||
3. Enni dinambulu jagati nunna nee-kanna vere galavaa= Pannuga madi nee
padasangatamai-yunnadi repagalu
|| Vinave ||
4. Paapa karundanu ne sukritaa-paadi karma meruga= Nee paada saroja
maakosagumu-naapai nee krupajelaga
|| Vinave ||
5. Nee korakai naammanamu drudhambaugaka Yeshu Prabhuvaa= Naaku
bishaachamuche bhrama janmamu-gaakundaga nelu
|| Vinave ||
––Mikkili Samuyelu
Comments
Post a Comment