Yehovaa Bhajana Cheeyandi | యెహోవా భజన చేయండి | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.17 - దైవారాధన

యెహోవా భజన చేయండి- పాప- నరులారా యీ రీతి మరచి పోకండి

॥ యెహోవా ॥

1. యేసు పేరిటి ప్రార్థనంబు-మన- దోసములను పోగొట్టను వెరవు=
భాసుర పరలోక సుఖము-కోటి-బాధలు-మనకున్న-సంతోషకరము

॥ యెహోవా ॥

2. యేసు క్రీస్తును గొలువండి- యేసు దాసులతో వాదము లాడకండి=
మోసపు దారి విడువండి-దోష-రాసుల నుర్విలోజేసికొన కండి

॥ యెహోవా ॥

3. జీవ రక్షకుని నమ్మండి -నిత్య-సేవలో మెలగక చెడిపోవకండి= భావించి
యాత్మన్ వేడండి-దేవ- దేవుని నెడబాసి- తెరవు విడకండి

॥ యెహోవా ॥

4. మాయ లోకపు భ్రాంతుల్విడిచి - మను-ష్యాయువు భువిలోన
జెల్లుటదలచి=మాయ మార్గము లెల్ల మరచి- మోక్ష-మార్గము మన
మున మరవక తలచి

॥ యెహోవా ॥

5. కాయము నొసగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలో
గానంగ రాదా= ఆయు వస్థిర మని తెలిసి-మీరు-కాయ మాత్మయు
నిపుడు-కర్తకు నిచ్చి

॥ యెహోవా ॥

––యేసుదాసు నర్సయ్య

Yehovaa bhajana cheyandi- paapa- narulaaraa yee reeti marachi pokandi

|| Yehovaa ||

1. Yesu periti praardhanambu-mana-dosamulanu pogottanu veravu=
bhasura paraloka sukhamu-koti-baadhala-manakunna-santoshakaramu

|| Yehovaa ||

2. Yesu Kreestunu goluvandi- Yesu daasulato vaadamu laadakandi=
mosapu daari viduvandi-dosha-raasula nurvilojesikona kandi

|| Yehovaa ||

3. Jeeva rakshakuni nammandi-nitya-sevalo melagaka chedipovakandi=
bhaavinchi yaatman vedandi-deva-devuni nedabaasi-teravu vidakandi

|| Yehovaa ||

4. Maaya lokapu bhraantulvidichi- manu-shyaayuvu bhuvilona
jellutadalachi=maaya maargamu lella marachi- moksha-maargamu mana
mun maravaka talachi

|| Yehovaa ||

5. Kaayamu nosagina prabhuni yayidu gaayambu laatmalo
gaananga raadaa= aayu vasthira mani telisi-meeru-kaaya maatmayu
nipudu-kartaku nichchi

|| Yehovaa ||

––Yesudaasu Narsayya

Comments