Yehovaa Naa Kaapari | యెహోవా నా కాపరి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.15 - యెహోవా నా కాపరి

యెహోవా నా కాపరి లే- మేమి గలుగదు =తన-మహా కృపతో

బ్రోచి నన్ను-మనుపు నాతడే

1. పచ్చికగల గోట్ల నను ప-రుండజేయుచు =గడు- హెచ్చగు
సౌఖ్యములు సదా- యిచ్చు నాతండే

2. శాంతికర జలములకు నను-సాగజేయుచు= వి-శ్రాంతి ప్రాణమున
కొసంగు-విభుడు అతడే

3. గాఢాంధకారమైన లోయల- గుండ బోయిన= నే-కీడుకు భయపడ
నిక నా-తోడు ఆయనే

4. దుద్దుకఱ్ఱతో శత్రువుల-దరు మగొట్టుచు= దన-దొడ్డ దండముతో
నీతి- దారిలో నడుపు

5. అందరిలో నన్ను నెంచి- యధిక ప్రేమతో=గడు-విందు లొసగి
తృప్తిపరచు-విభుడు ఆయనే

6. ముఖము కళగా నుండునట్లు- మంచి తైలమున్ = నా-సఖుడు
నాకు బూయుచుండు సకల వేళలన్

7. బ్రదుకు దినము లన్నిట నాకు-బంటులవలెనే= నను-వెదకి కృపా
క్షేమములు నా-వెంటవచ్చును

––సరెళ్ల సమూయేలు సుబ్బయ్య

Yehovaa naa kaapari le- memi galugadu =tana-mahaa krupato

brochi nannu-manupu naatade

1. Pachchikagala gotla nanu pa-rundajeyuchu =gadu- hechchagu
saukhyamulu sadaa- ichchu naatande

2. Shaantikara jalamulaku nanu-saagajeyuchu= vi-shraanti praanamuna
kosangu-vibhudu atade

3. Gaadhaandhakaaramaina loyal- gunda boyina= ne-keeduku bhayapada
nika naa-todu aayane

4. DuddukaRRato shatruvula-daru magottuchu= dana-dodda dandamuto
neeti-daarilo nadupu

5. Andarilo nannu nenchi- yadhika premato=gadu-vindu losagi
truptiparachu-vibhudu aayane

6. Mukhamu kalagaa nundunatlu- manchi tailamun = naa-sakhuDu
naaku booyuchundu sakala velalan

7. Braduku dinamu lannita naaku-bantulavalene= nanu-vedaki krupaa
kshemamulu naa-ventavachchunu

––Sarella Samuyelu Subbayya

Comments