Yesu Naayakuda | యేసు నాయకుడ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.3 - యేసు సహాయమునకై ప్రార్థన

యేసు నాయకుడ-యెల్ల వేళలను నీ-దాసులు నేలుమయ్యా=

మోసములన్నిటి-మునగద్రోతునని- బాసలు జేసిన-ప్రభుడవు నీవెగా

॥ యేసు ॥

1. రేయింబవలు మా-న్యాయము చెరిపెడి- మాయ పిశాచిని =
త్రోయుమి దూరము- బాయక భక్తుల-చేయి విడువని బహుశ్రేష్ఠుడ
వీవేగా

॥ యేసు ॥

2. హృదయము లోకము- మది పాపము మమ్ము - సతతము శ్రమ
పెట్టున్= సదయుడ మమ్మును- వదలక నిత్యము- మది తలపులలో-
మహిమగ నేలుమీ

॥ యేసు ॥

3. కాపాడుమి మమ్ము- మాపు రేపు నీ-శ్రీ పాదము లొద్దను= ఏ పాపము
లును-ఏలకుండగ నీ -ప్రాపున బెంచుము- మా పాలకుడవో

॥ యేసు ॥

4. మా కొరకై నీ- మేనును మ్రానున-మేకులతో గొట్టగ =మానము
మహిమలు- మనుజుల కియ్యను- భానుడ రాజుగ- బ్రతికి లేచితివి

॥ యేసు ॥

5. చెరను చెఱనుగా -మరి పట్టుక నీవు-పరమున కరిగితివే= వరముల
నిడితివి- ధరలో నరులకు- పరముడ నీ దయ- మరువ శక్యమా

॥ యేసు ॥

––గొల్లపల్లి నతానియేలు

Yesu naayakuda-yella veelalanu nee-daasulu nelumayyaa=

Mosamulanniti-munagadrothunani- baasalu jeesina-prabhudavu neevegaa

|| Yesu ||

1. Reeyimbavalu maa-nyaayamu cheripedi- maaya pishaachini =
Throyumi dooramu- baayaka bhakthula-cheeyi viduvani bahushreeshthuda
Veevegaa

|| Yesu ||

2. Hrudayamu lokamu- madi paapamu mammu - sathathamu shrama
Pettun= sadayuda mammunu- vadalaka nithyamu- madi thalapulalo-
Mahimaga nelumee

|| Yesu ||

3. Kaapaadumi mammu- maapu reepu nee-shree paadamu loddanu= e paapamu
Lunu-elakundaga nee -praapuna benchumu- maa paalakudavo

|| Yesu ||

4. Maa korakai nee- meenunu mraanuna-meekulatho gottaga =maanamu
Mahimalu- manujula kiyyanu- bhaanuda raajuga- brathiki leechithivi

|| Yesu ||

5. Cheranu cheranugaa -mari pattuka neevu-paramuna karigithive= varamula
Nidithivi- dharalo narulaku- paramuda nee daya- maruva shakyamaa

|| Yesu ||

––Gollapalli Nathaaniyelu

Comments