Bhajana Cheyuchu Bhaktapaalaka | భజన చేయుచు భక్తపాలక | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.81 - యేసు నామ భజన

భజన చేయుచు భక్తపాలక- ప్రస్తుతించు నీ నామమును = వృజినములపై జయము నిచ్చిన- విజయుడా నిను వేడుకొందు

॥ భజన ॥

1. దివ్యపదవిని విడిచి నీవు- దీనుడవై పుట్టినావు= భవ్యమైన బోధ లెన్నో -బాగుగా ధర నేర్పినావు

॥ భజన ॥

2. నరుల గావను పరము నుండి -ధరకు నీవు వచ్చినావు -పరుడ నైన నా కొరకు నీ -ప్రాణము నర్పించినావు

॥ భజన ॥

3. చెడినవాడ నైన నన్ను- జేరదీసి బ్రోచినావు =పడిన నాదు గోతి నుండి -పైకి లేవనెత్తి నావు

॥ భజన ॥

4. ఎంత ప్రేమ యెంత దయ- యెంత కృప యేసయ్యా నీకు=ఇంత యని వర్ణింప నిలలో- నెవనికిని సాధ్యంబు కాదు

॥ భజన ॥

––దొరసామి ఆరోగ్యము

Bhajana cheyuchu bhaktapaalaka-prastutinchu nee naamamunu = vrujinamulpai jayamu nichchina-vijayudaa ninu vedukondu

|| Bhajana ||

1. Divyapadavini vidichi neevu-deenudavai puttinaavu=bhaavyamaina bodha lenno-baagugaa dhara nerpinaavu

|| Bhajana ||

2. Narula gaavanu paramu nundi-dharaku neevu vacchinaavu=parudanaine naa koraku nee-praanamu narpinchinaavu

|| Bhajana ||

3. Chedinavaadanaine nannu-jeradeesi brochinaavu=padina naadu goti nundi-paiki levanettinaavu

|| Bhajana ||

4. Enta prema yenta daya-yenta krupa Yesayyaa neeku=intayani varnimpa nilalo- nevanikini saadhyambu kaadu

|| Bhajana ||

––Dora Saami Aarogyamu

Comments