Devuni Goppa Premanu | దేవుని గొప్ప ప్రేమను | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.65 - The love of God
॥ దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము ॥
1. దేవుని గొప్ప ప్రేమను
కలంబు తెల్ప జాలదు
అత్యున్నత నక్షత్రమున్
అధోగతిన్ ఆవరించున్
నశించు జాతిన్ రక్షింపన్
సుతుని బంపెను
పాపంబు నుండి పాపికి
విశ్రాంతి జూపెను.
॥ దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము ॥
2. యుగాంతకాల మందున
భూరాజ్యముల్ నశించగా
యేసున్ నిరాకరించువారు
చావును కోరువేళను
దేవుని ప్రేమ గెల్చును
అనంత జీవము
నశించు వారి కాశ్రయంబు
ప్రేమ సందేశము
॥ దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము ॥
3. సముద్రము సిరాతో నిండి
ఆకాశమె కాగితమై
కొమ్మ లెల్ల కలంబులై
ప్రతి నరుండు కరణమై
దేవుని ప్రేమన్ చిత్రింపన్
సంద్రంబు యింకును
ఆకాశ వ్యాప్తి యంతయు
చాలక పోవును.
॥ దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము ॥
––అను: ఏ.బి. మాసిలామణి
|| Devuni prema sampada apaaramainadi nirantaramu nilchunu prema sangeetamu ||
1. Devuni goppa premanu
kalambu telpa jaaladu
atyunnata nakshatramun
adhogatin aavarinchun
nashinchu jaatin rakshimpan
sutuni bampenu
paapambu nundi paapiki
vishraanti joopenu.
|| Devuni prema sampada apaaramainadi nirantaramu nilchunu prema sangeetamu ||
2. Yugantakaala manduna
bhooraajyamul nashinchaagaa
Yesun niraakarinchuvaaru
chaavunu koruvelanu
Devuni prema gelchunu
ananta jeevamu
nashinchu vaari kaashrayamb
prema sandeshamu
|| Devuni prema sampada apaaramainadi nirantaramu nilchunu prema sangeetamu ||
3. Samudramu siraato nindi
aakaashame kaagitamai
komma lella kalambulai
prati narundu karanamai
Devuni preman chitrimpan
sandrambu yinkunu
aakaasha vyaapti yantayu
chaalaka povunu.
|| Devuni prema sampada apaaramainadi nirantaramu nilchunu prema sangeetamu ||
––Anu: A. B. Maasilamani
Comments
Post a Comment