Emi Nenu Samarpintu | ఏమి నేను సమర్పింతు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.86 - యేసున కేమి సమర్పించుదును?
ఏమి నేను సమర్పింతు-యేసూ-యెట్లు నిన్ను స్తుతియింతు-ఏమి సమర్పింతు- హీనుడ నగు నేను- గామితార్థము లెల్ల-గలుగ జేయు నీకు
॥ ఏమి ॥
1. నేను మార్గము దప్పి యుండగా నన్ను- నీవు కంటివి కరుణ నిండగ- దీనపాపులను-ధృఢముగ బ్రోవను- దానమిచ్చితివి- తనర నీ ప్రాణము
॥ ఏమి ॥
2. అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల- అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి - పొందుగ జేసెద-నొందు మా నా నుతి-నుత్తమ ప్రభు క్రీస్తు
॥ ఏమి ॥
3. నీయందే యానంద మొందగ-యేసు-నీ దైన యాత్మ నాకందగ= జేయు మంచు నీకు జేసెద బ్రార్ధన- నా యందు దయచేసి- నా మనవి నాలించు
॥ ఏమి ॥
4. నేను జేసిన యఘము లెల్లను-గర్త-నీ యెదుట దలంచు కొందును= నేను సిగ్గు నొంది- నిజముగ గుందుచు- నేను వేడుకొందు-నీ క్షమాపణ కొరకు
॥ ఏమి ॥
5. నన్ను నీవు స్థిరపరచుము-కర్త- యన్నిట-నను బరపరచుము= తిన్నని మార్గమున-దృఢముగ నేగుచు- నిన్ను నే స్తుతియింతు-నిండుగ నెల్లప్పు
॥ ఏమి ॥
––పులిపాక జగన్నాధము
Emi nenu samarpintu-Yesoo-yetlu ninnu stutiyintu-emi samarpintu-heenuda nagu nenu-gaamitaardhamu lella-galuga jeyu neeku
|| Emi ||
1. Nenu maargamu dappi yundagaa nannu-neevu kantivi karuna nindaga-deenapaapulanu-dhrudhamuga brovanu-daanamicchitivi-tanara nee praanamu
|| Emi ||
2. Andari kora keevu techchina migula-andamaina nitya rakshana andi ninnu vinati-ponduga jeseda-nondu maa naa nuti-nuttama Prabhu Kreestu
|| Emi ||
3. Neeyande aananda mondaga-Yesu-nee daina aatma naakandaga= jeyu manchu neeku jeseda braardhana-na yandu dayachesi-naa manavi naalinchu
|| Emi ||
4. Nenu jesina yagh amu lellanu-garta-nee yeduta dalanchu kondunu= nenu siggu nondu-nijamuga gunduchu-nenu vedukondu-nee kshamaapana koraku
|| Emi ||
5. Nannu neevu sthiraparachumu-Karta-yannita-nanu baraparachumu= tinnani maargamuna-dhrudhamuga neguchu-ninnu ne stutiyintu-ninduga nellappu
|| Emi ||
––Pulipaaka Jagannaadhamu
Comments
Post a Comment