Enta Premincheno Devudu | ఎంత ప్రేమించెనో దేవుడు | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.64 - దేవుని ప్రేమ
ఎంత ప్రేమించెనో -దేవుడు మనపై- నెంత దయజూపెనో
వింత గల యీ దైవ ప్రేమను- సాంతమున ధ్యానింపరే
॥ ఎంత ॥
1. పనికి మాలిన పాపాత్ముల మైన మనము ఆ-ఘనదేవునికి పిల్లల
మనబడుటకై = తన కుమారుని మరణ బలిరక్తమున మన-లను
స్వీకరించుకొనెను దీనిని జూడరే
॥ ఎంత ॥
2. పెంటకుప్ప మీద పడియున్న యీ నీచ- మంటి పురుగులనులేవ
నెత్తి=మింటిపై గనులతో గూర్చుండజేయు నీ-మంటి కేతెంచె మన-
వంటి దేహము దాల్చి
॥ ఎంత ॥
3. ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ- సాక్షాత్తుగా మనపయి
నుండగా =నీ క్షితి నా ప్రేమ ద్రాక్షారసము కంటె- దీక్షగ వేడి యపేక్షింప
తగు నాహా
॥ ఎంత ॥
4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘను డాకాశము నుండి
మరలి వచ్చి= మన దైన్య దేహమును తన రూపముకు మార్చి-కొని పోయి
తన రాజ్యమును మన కీయును
॥ ఎంత ॥
5. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ-పెట్టియున్న సత్ క్రైస్తవులూ
ప్రభు-డెట్టివాడొ మనము నట్టివారుగ ప్రభుని- కట్టడలను మదిని బెట్టి
యుందము వేడ్క
॥ ఎంత ॥
––చదలవాడ జకర్యా
Enta premincheno - Devudu manapai- nenta dayajoopeno
vinta gala yee daiva premanu-saantamuna dhyaanimpare
|| Enta ||
1. Paniki maalina paapaatmula maina manamu aa-ghanadevuniki pillala
manabadutakai = tana kumaaruni marana baliraktamuna mana-lanu
sweekarinchukonenu deenini joodare
|| Enta ||
2. Pentakuppa meeda padiyunna yee neecha-manti purugulanuleva
netti=mintipai ganulato goorchundajeyu nee-manti ketenche mana-
vanti dehamu daalchi
|| Enta ||
3. Draakshaarasapu madhuramunu minchi yee prema-saakshaatthugaa manapayi
nundagaa=nee kshiti naa prema draakshaarasamu kante-deekshaga veedi yapekshimpa
tagu naahaa
|| Enta ||
4. Manalanu preminchi tana praanamichina ghanu daakaashamu nundi
marali vacchi=mana dainya dehamunu tana roopamuku maarchi-koni poyi
tana raajyamunu mana keeyunu
|| Enta ||
5. Gattiga manamunam dittinireekshana-pettiyunna sat kraistavulu
Prabhu-dettivaado manamu nattivaaruga Prabhuni-kattadalanu madini betti
yundamu vedka
|| Enta ||
––Chadalavaada Jakaryaa
Comments
Post a Comment