Gatakaalamula Yandu Ghana | గతకాలముల యందు ఘన | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.62 - అనంత సహాయుడగు దేవుడు

॥ గత ॥

1. గతకాలముల యందు - ఘన సహాయుడ దేవా-హిత నిరీక్షణ నీవే-
యెన్నేండ్లకైన=అతిగా వీచిన గాడ్పు-లందు దుర్గం బీవె-నిత్యాంత
గృహమీవె-నిత్యుడౌ ప్రభువా

॥ గత ॥

2. నీ సింహాసన ఛాయ-లో సురక్షితముగ-వాసము సేయుదుము-
భవ్యగుణ తేజా= నీ సుబాహువే చాలు-నిశ్చయ సురక్షా-వాసముగా
నొప్పు-ప్రభువా ఘన దేవా

॥ గత ॥

3. నగముల్ వరుస నిలిచి-నగధర నిర్మాణ-మగుటకు మున్నేయ-నంత
ప్రభు నీవు-అగణిత వత్సరము అగువరకు నీవే మా- భగవంతుడవు నిన్ను
ప్రణుతింతు మేము

॥ గత ॥

4. వేయి యుగములు నీకు- దెస గతించిన యొక్క- సాయంత్ర
సదృశము= సవిత్రుడురు శో-భాయుతముగ లే-వక ముందురాత్రిలో-
ప్రహరము సుమియవ్వి

॥ గత ॥

5. గత కాలముల యందు- ఘన సహాయుడ దేవా-హిత నిరీక్షణ నీవే-
యెన్నేండ్లకైన- క్షితిజీవితాంతము-గతిగా నుండుము-దేవా - నితాంత
గృహ మీవె-నిత్యుడౌ ప్రభువా

॥ గత ॥

––జాన్ చౌధరి

|| Gata ||

1. Gatakaalamula yandu - Ghana sahaayuda Devaa-hita nireekshana neeve-
yenneendlakaina-atigaa veechina gaadpu-landu durgam beeve-nityaanta
gruhameeve-nityudau Prabhuvaa

|| Gata ||

2. Nee simhaasana chaaya-lo surakshitamutuga-vaasamu seyudumu-
bhavyaguna tejaa-nee subaahuve chaalu-nishchaya surakshaa-vaasamugaa
noppu-Prabhuvaa Ghana Devaa

|| Gata ||

3. Nagamul varusa nilichi-nagadhara nirmaana-maguta ku munneya-nanta
Prabhu neeve-aganita vatsaramu aguvaraku neeve maa-Bhagavantudavu ninnu
pranuthintu memu

|| Gata ||

4. Veyi yugamulu neeku-desa gatinchina yokka-saayantra
sadrushamu=savitruduru sho-bhaayutamuga le-vaka munduraatrilo-
praharmu sumiyavvi

|| Gata ||

5. Gatakaalamula yandu-Ghana sahaayuda Devaa-hita nireekshana neeve-
yenneendlakaina-kshitijeevitaantamu-gatiga nundumu-Devaa-nitaanta
gruha meeve-nityudau Prabhuvaa

|| Gata ||

––Jaan Chaudhary

Comments