Ghanudaina Yehovaa Gadde | ఘనుడైన యెహోవా గద్దె | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.61 - సృష్టికర్త స్తుతి

ఘనుడైన యెహోవా-గద్దె ముందుట మీరు- వినతు లిప్పుడు చేయుడి-

యో జనులార-వినయంబుగా నిర్మ- లానంద రస లహరి- మన మనం
బొప్పుచుండ- నో జనులార

॥ ఘనుడైన ॥

1. ఒక్కడే మన కర్త యుండు దేవుడని యున్- జక్క గాను సృజియించు-
సంహరించు ననియున్- నిక్కముగదెలిసికొండీ మన సహాయ మే-
మక్కరలేకుండ మనల= మిక్కుటపు పరిపాలనపు బలము చేజెసె-
మృత్తుచే మానవులగ-దిక్కు-గానక తిరుగు గొ-ర్రెల వలె మనము చెదర
దిరుగదన దొడ్డిబెట్టె-నో జనులారా

॥ ఘనుడైన ॥

2. మే మందరము వందనపు పాటతో మూగి-మించు నీ గుమ్మములలో-
మా మా స్వరము లెత్తుదుము నభము పాడగా- మధురలయ
సహితముగను-భూమియున్ దనదు పదివేల జిహ్వల వల=బొందైన నీ
నగరి కా-ధామంబులను గాన సన్నుతి వితతి పూరి- తమ్ములుగజేయు
దేవా యో జనులార

॥ ఘనుడైన ॥

3. ధరయంత విస్తారమైయున్నది నీ యాజ్ఞ-తగ విరహితాద్యంతమై - స్థిరమైన
కాలంబు వలెనె యున్న దయదయ- పొరలిపోవుచు నున్న వంత్సరముల్
నిలిచిపోయి నప్పటికి నీదు -సత్యంబు నిలిచియుండున్-వరశిలా ఖండ
పర్వము తోడను సాటి-వన్నె కెక్కుచు నెంతయున్ ఓ జనులార

॥ ఘనుడైన ॥

––విలియం డాసన్

Ghanudaina Yehovaa-gadde munduta meeru-vinatu lippudu cheyudi-

Yō janulaara-vinayambuga nirma-laananda rasa lahari-mana manam
boppuchunda-nō janulaara

|| Ghanudaina ||

1. Okkade mana karta yundu Devudani yun-jakka gaanu sruyinchu-
samharinchu naniyun-nikkamuga delisikonḍi mana sahaaya me-
makkaralekunda manala-mikkutapu paripaalanapu balamu chejes e-
mruttuche maanavulaga-dikku-gaanaka tirugu go-rrela vale manamu chedara
dirugadana doddibette-nō janulaara

|| Ghanudaina ||

2. Meemandaramu vandanapu paatato moogi-minchu nee gummamulalo-
maa maa svaramu lettudumu nabhamu paadaga-madhuralaya
sahitamuganu-bhoomiyun danadu padivela jihvala vala-bondaina nee
nagari kaa-dhaamambulanu gaana sannuti vitati poori-tammulugajeyu
Devaa yō janulaara

|| Ghanudaina ||

3. Dharayanta vistaaramaiyunnadi nee yaajna-taga virahitaadyantamai-sthiramaina
kaalambu valene yunna dayadaya-poralipovuchu nunna vantsaramul
nilichipoyi nappatiki needu-satyambu nilichiyundun-varashilaa khanda
parvamu todanu saati-vanne kekkuchu nentayun yō janulaara

|| Ghanudaina ||

––William Dawson

Comments