Kreestu Yesuku Mangalam | క్రీస్తు యేసుకు మంగళం | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.76 - క్రీస్తు యేసుకు మంగళహారతి

క్రీస్తు యేసుకు మంగళం- మా కీర్తి రాజుకు మంగళం=క్రీస్తు యేసే

దైవమంచును - కూడి పాడుదు మంగళం

॥ క్రీస్తు ॥

1. ప్రవచనంబులు బల్కినట్టి- ప్రాణనాధుడవీవె నీదు-స్తవము జేయుచు
మెలగు మనుజుల-సత్ప్రభువు కిదె మంగళం

॥ క్రీస్తు ॥

2. జగము నేలెడు జీవనాధుడ- జపములందెడు గృపకటాక్ష-ఆగణి
తంబగు ప్రేమ జూపిన- అమర తేజుడ మంగళం

॥ క్రీస్తు ॥

3. ఖలుల బ్రోచెడు కనికరాత్మ-కేంద్ర స్థానము నీ పదాబ్జము=
కలుషమును కడమార్చినట్టి-సిలువ నాధుడ మంగళం

॥ క్రీస్తు ॥

4. మనము గోరెడు మా హృదీశుడ- మార్గదర్శుడ వీవెగాన= అనయము
నినుగొల్చు జనముల-ఆది దేవుడ మంగళం

॥ క్రీస్తు ॥

5. జనక సుత శుద్ధాత్మ దేవుడ-గనని వినని ప్రేమ పూర్ణుడ= తనివి తీరగ
పాడుదము యీ-ధాత్రి నీకు మంగళం

॥ క్రీస్తు ॥

––పి.రవి వర్మ

Kreestu Yesuku mangalam-Maa keerthi raajuku mangalam=Kreestu Yese

daivamanchunu-koodi paadudu mangalam

|| Kreestu ||

1. Pravachanambulu balkinatti-praananaadhudaveeve needu-stavamu jeyuchu
melagu manujula-satprabhuvu kide mangalam

|| Kreestu ||

2. Jagamu neledu jeevanaadhuda-japamulandedu grupukataaksha-aagani
tambagu prema joopina-amara tejuda mangalam

|| Kreestu ||

3. Khalula brochedu kanikaraatma-kendra sthaanamu nee padaabjamu=
kalushamunu kadamaarchinatti-siluva naadhuda mangalam

|| Kreestu ||

4. Manamu gored u maa hrudeeshuda-maargadarshuda veevugaana=ananyamu
ninugolchu janamula-aadi devuda mangalam

|| Kreestu ||

5. Janaka suta shuddhaatma devuda-ganani vinani prema poornuda=tanivi teeraga
paadudamu yee-dhaatri neeku mangalam

|| Kreestu ||

––P. Ravi Varma

Comments