Mangalambani Paadare Kreestuku | మంగళంబని పాడరే క్రీస్తుకు | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.75 - క్రీస్తుకు మంగళ స్తోత్రము
మంగళంబని పాడరే-క్రీస్తుకు జయ మంగళంబని పాడరే- యేసుకు
జయ-మంగళంబని పాడరే= మంగళంబని పాడి సజ్జ-నాంగపూజితుడై
కృపాత-రంగిలోక సమూహ పాపవి-భంగుడని యుప్పొంగి జయజయ
॥ మంగళ ॥
1. ఘన యూద దేశంబులో - బెత్లహే-మున యూదా గోత్రంబులో=
వినుడు యోసేపునకు సతియై తనరుచుండెడి మరియ కడుపున జననమై
యీ మర్త్య వరులకు-సద్గతిని కల్గించు వానికి
॥ మంగళ ॥
2. సోదరాళి భంగిని భక్తుల నెల్లజూచి ప్రోచెడు వానిని= యూద
దేశపు వారలధిక- భాధ బెట్టుచు హింసజేసిన -సాదరంబున త్రిదన
ములకు ముదముతో గనుపడిన ప్రభునకు
॥ మంగళ ॥
3. ధరణి గ్గొల్చెడి దాస జనములనుబ్రోచు-దైవ తనయుడని నిజ=
మరయ నిలను స్మరించువారికి గురుతరంబగు కలుష జలనిధి-
దరికిజేర్చు పరమ పదమే- యిరు వొనర్చెద ననిన ప్రభునకు
॥ మంగళ ॥
––పురుషోత్తము చౌధరి
Mangalambani paadare-Kreestuku jaya mangalambani paadare-Yesuku
jaya-mangalambani paadare=mangalambani paadi sajja-naangapoojitudai
krupaa-ta-rangiloka samooh paapavi-bhangudani yuppongi jayajaya
|| Mangala ||
1. Ghana Yooda deshambulo-Bethlahe-muna Yoodaa gotrambulo=
vinudu Yosepunaku satiyai tanaruchundedi Mariya kadupuna jananamai
yee martya varulaku-sadgatini kalginchu vaaniki
|| Mangala ||
2. Sodaraali bhangini bhaktula nellajoochi prochedu vaanini=Yooda
deshapu vaaraladhika-bhaadha bettuchu hinsajesina-saadarambuna tridan
mulaku mudamuto ganupadina Prabhunaku
|| Mangala ||
3. Dharani ggolchedi daasa janamulanu brochu-daiva tanayudani nija=
maraya nilanu smarinchuvaariki gurutarambagu kalusha jalanidhi-
darikijerchu parama padame-yiru vonarchedan anina Prabhunaku
|| Mangala ||
––Purushottamu Choudhari
Comments
Post a Comment