Mangalame Yesunaku | మంగళమే యేసునకు మనుజావతారునకు | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.73 - క్రీస్తునకు స్తోత్రము
మంగళమే యేసునకు- మనుజావతారునకు-శృంగార ప్రభువునకు-
క్షేమాధిపతికి
॥ మంగళమే ॥
1. పరమ పవిత్రునకు వరదివ్య తేజునకు=నిరూపమానందునకు-
నిపుణ వేద్యునకు
॥ మంగళమే ॥
2. దురిత సంహారునకు వరసుగుణోదారునకు= కరుణా
సంపన్నునకు- జ్ఞాన దీప్తునకు
॥ మంగళమే ॥
3. సత్య ప్రవర్తునకు-సద్ధర్మశీలునకు=నిత్యస్వయంజీవునకు-
నిర్మలాత్మునకు
॥ మంగళమే ॥
4. యుక్త స్తోత్రార్హునకు- భక్త రక్షామణికి = సత్యపరంజ్యోతియగు-
సార్వ భౌమునకు
॥ మంగళమే ॥
5. నరఘోర కలుషముల- నురుమారంగ నిల=కరుదెంచిన మాపాలి-
వర రక్షకునకు
॥ మంగళమే ॥
6. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు = పరమేశ్వర తనయునకు-
బ్రణుతింతుము నిన్ను
॥ మంగళమే ॥
––పురుషోత్తము చౌధరి
Mangalame Yesunaku-Manujaavataarunaku-shrungaara Prabhuvunaku-
kshemaadhipatiki
|| Mangalame ||
1. Parama pavitrunaku varadivya tejunaku=niroopamaanandunaku-
nipuna vedyunaku
|| Mangalame ||
2. Durita samhaarunaku varasugunodaarunaku=karunaa
sampannunaku-jnaana deeptunaku
|| Mangalame ||
3. Satya pravartunaku-saddharma sheelunaku=nitya svayamjeevunaku-
nirmalaatmunaku
|| Mangalame ||
4. Yukta stotrarhunaku-bhakta rakshaa maniki=satyaparanjyotiyagu-
saarva bhaumunaku
|| Mangalame ||
5. Naraghora kalushamula-nurumaaraanga nila=karudenchina maapaali-
vara rakshakunaku
|| Mangalame ||
6. Paramapuri vaasunaku-naradaiva roopunaku=Parameshwara tanayunaku-
pranutintumu ninnu
|| Mangalame ||
––Purushottamu Choudhari
Comments
Post a Comment