Mangalamu Baadare Kreestunaku | మంగళము బాడరే క్రీస్తునకు | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.72 - క్రీస్తునకు మంగళార్చన
మంగళము బాడరే- క్రీస్తునకు జమ-మంగళము బాడరే-యో
ప్రియులారా-మంగళము బాడరె= మంగళము బాడి దు-స్సంగతిని వీడి
ప్రభు-సంగులను గూడి మదిబొంగుచు జెలంగుచును
॥ మంగళము ॥
1. రాజులకు రాజని దూతల చేత-పూజగొనువాడని- తేజమున
సూర్యునికి-దీప్తి నిడు సద్గుణ వి- రాజితుని సాధుజన రక్షకుని పక్షముగ
॥ మంగళము ॥
2. కరుణగల వాడని-పాపులబ్రోచు-బిరుదుగొని నాడని= మరణ
మును దాని బరి-మార్చు ఘన శక్తిగల- పరమ గురుడితడె మన-
పాలి వాడని శుభ
॥ మంగళము ॥
3. సంగీతము పాడుచు సువార్త ప్ర- సంగములగూడుచు= నింగికిని
భూమికిని నిత్యముగ నేలదగు శృంగారపు రాజునకు-క్షేమ మగు
ఆమే నని
॥ మంగళము ॥
––పురుషోత్తము చౌదరి
Mangalamu baadare-Kreestunaku jama-mangalamu baadare-yo
priyulaaraa-mangalamu baadare=mangalamu baadi-dussangatini veedi
Prabhu-sangulanu goodi madibonguchu jelanguchunu
|| Mangalamu ||
1. Raajulaku raajani dootala cheta-poojagonuvaarani-tejamuna
sooryuniki-deepti nidu sadguna vi-raajituni saadhujana rakshakuni pakshamuga
|| Mangalamu ||
2. Karunagala vaadani-paapulabrochu-birudugoni naadani=marana
munu daani bari-maarchu ghana shaktigala-parama guruditade mana-
paali vaadani shubha
|| Mangalamu ||
3. Sangeetamu paaduchu suvaartta pra-sangamulagooduchu=ningikini
bhoomikini nityamuga neladagu shrungaarapu raajunaku-kshema magu
aame nani
|| Mangalamu ||
––Purushottamu Choudari
Comments
Post a Comment