Paramapuri Kalpabhooja Nirata | పరమపురి కల్పభూజ నిరత | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.63 - త్రేక దేవునికి స్తుతి

పరమపురి కల్పభూజ-నిరత భూనరుల పూజ= యురుతరచిత మహిమ

తేజ-వరు స్తుతి సల్పెదము రాజ

॥ పరమ ॥

1. జనక సుత శుద్ధాత్మ-యను పేరిట యే కాత్మ=ఘనతర సంరక్ష ప్రేమ-
ననిపి మము కనికరించు

॥ పరమ ॥

2. నీవే మా ప్రాపు వంచు-నెరనమ్మి యుందు మంచు= భావంబున
దలచు వారి-బావనులజేయు సదా

॥ పరమ ॥

3. కలుషంబులను హరింప-నిల సైతానును జయింప= బలుమారు
నిను దలంచు బలము గల ప్రభుడ వీవే

॥ పరమ ॥

4. ఈ లోక పాపనరులు చాల నినునమ్మ మరల-దూలిచే దారుణ సై
తానును బడద్రొక్కి వేయు

॥ పరమ ॥

5. అల్ఫా ఓమేగయును-నాద్యంతంబులును-కల్పాంత=స్థాయువైన
కర్తా కరుణించు మమును

॥ పరమ ॥

––పాలపర్తి యాకోబు

Paramapuri kalpabhooja-nirata bhoonarula pooja=yurutarachita mahima

teja-varu stuti salpedamu Raaja

|| Param ||

1. Janaka suta shuddhaatma-yanu perita ye kaatma=ghanatara samraksha prema-
nanipi mamu kanikarinchu

|| Param ||

2. Neeve maa praapu vanchu-neranammi yundu manchu=bhaavambuna
dalachu vaari-bhaavanulajeyu sadaa

|| Param ||

3. Kalushambulanu harimpa-nila saitaanu jayimpa=balumaaru
ninu dalanchu balamu gala Prabhuda veeve

|| Param ||

4. Ee loka paapanarulu chaala ninunamma marala-dooliche daaruna sai
taanunu badadrokkiveyu

|| Param ||

5. Alphaa Omegayunu-naadyantambulunu-kalpaanta=sthaayuvaina
kartaa karuninchu mamunu

|| Param ||

––Paalaparti Yaakobu

Comments