Raare Mana Yesu | రారే మనయేసు స్వామిని | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.83 - క్రీస్తును చూడ రండి
రారే మనయేసు స్వామిని-జూతము కోర్కె- లూర ప్రియులారా పేర్మిని= గూరిమి భక్తుల - జేరువ-విందట- భూరి దయామృత- సారము లొలికెడు చారు కటాక్ష వి-శాలేక్షణుడట- నారకులగు నర- నారీ-జనులకు-దారక మొసగను-దానె పిలుచునట-దారుణ పాప మ- హారణ్యమునకు- గారు చిచ్చు గతి - గన్పడు వాడట - ఘోర దరిద్రత - గూల్చెడివాడట= సారంబగు తన-సభకు మకుటమట
॥ రారే ॥
1. పతిత పావనమౌ వేల్పట - అనాది దేవ -సుతుడై యిలజేరి నాడట= సతతము కడు దురి- తతమోయుతమగు- ప్రతి దేశమునకు హితభాస్కరు డట అతులిత మోక్షో-న్నత గుణగణుడట కుతలంబున స-ద్గతి రహితంబగు- పతితులగావను-మృతుడై నాడట- అతి పుణ్య తను-క్షత శోణితమును వ్రతముగ సిలువను- నతడొసంగెనట-మృతిని జయించుచు- బ్రతికి లేచెనట-మతి నమ్మిన మన-గతి యితడేనట
॥ రారే ॥
2. తుదలేని మహిమవాడట - తను గొల్చు సాధు-హృదయుల సొమ్ము మూటట= చెదిరిన గొట్టెల-వెదకవచ్చెనట - చిదురుపలగు జనహృదయము లన్నిట-బదిలముగా నె-మ్మది నిడువాడట- నదితట మఠ జన-పదవనముల స-మ్మద శుభవార్తనుబలికిన వాడట సదయత సంధుల- కక్షుల నిడెనట, వెదకి బధిరులకు- వీను -లొసగె నట- సదమల మోక్ష- ప్రదుడగు విభుడట=యిదిగో మనకిత- డేలినవాడట.
॥ రారే ॥
––పురుషోత్తము చౌధరి
Raare mana Yesu Swaamini-jootamu korke-loora priyulaaraa permini=goorimi bhaktula-jeruva-vindata-bhoori dayaamruta- saaramu lolikedu chaaru kataaksha vi-shaalekshanudata-naarakulagu nara- naari-janulaku-daaraka mosaganu-daane piluchunata-daaruna paapa ma- haaranyamunaku-gaaru chicchu gati-ganpadu vaadata-ghora daridrata- goolchedivaadat=saarambagu tana-sabhaku makutamata
|| Raare ||
1. Patita paavanamau velpata-anadi Deva-sutudai yilajeri naadata= satatamu kadu duri-tatamoyutamagu-prati deshamunaku hitabhaaskaru data-atulita moksho-nnata gunaganudata kutalambuna sa-dgati rahitambagu-patitula gaavanu-mrutudai naadata-ati punya tanu-kshata shonitamunu vratamuga siluvanu- natadosangenata-mrutini jayinchuchu-bratiki lechenata-mati nammina mana-gati yitad enata
|| Raare ||
2. Tudaleni mahimavaadata-tanu golchu saadhu-hrudayula sommu mootata=chedirina gottela-vedakavacchenata-chidurupalagu janahrudayamu lannita-badilamuga ne-mmadi niduvaadata-naditata matha jana-padavanamula sa-mmada shubhaavaartanubalikina vaadata sadayata sandhula-kakshula nidenata, vedaki badhirulaku-veenu -losage nata-sadamala moksha-pradudagu vibhudata=yidigo manakita-delinavaadata
|| Raare ||
––Purushottamu Choudhari
Comments
Post a Comment