Vandaname Yesunaku Varasugunodaarunaku | వందనమే యేసునకు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.74 - క్రీస్తునకు మంగళార్చన

వందనమే యేసునకు - వరసుగుణోదారునకు = సౌందర్య ప్రభువునకు

సర్వేశ్వర నీకు

॥ వందనమే ॥

1. యెహోవా తనయునకు -ఇమ్మానుయేలునకు = బహు కరుణా
భరుణునకు-ప్రభువుల ప్రభువునకు

॥ వందనమే ॥

2. అశ్రిత జనపాలునకు- నకలుష వరదేహునకు = ఇశ్రాయేల్ రాజు
నకు- యెహోవా నీకు

॥ వందనమే ॥

3. మరియాతనుజునకు-మహిమ గంభీరునకు= పరిశుద్ధాచరుణునకు=
బరమేశ్వర నీకు

॥ వందనమే ॥

4. రాజులపై రాజునకు-రవికోటి తేజునకు = పూజార్హ పదాబునకు-
భువనావన నీకు

॥ వందనమే ॥

5. ప్రేమ దయా సింధునకు- క్షేమామృత పూర్ణునకు = ఆమే నని
సాష్టాంగము లర్పింతుము నీకు

॥ వందనమే ॥

––పురుషోత్తము చౌధరి

Vandaname Yesunaku - varasugunodaarunaku = saundarya Prabhuvunaku

Sarveshwara neeku

|| Vandaname ||

1. Yehovaa tanayunaku - Immaanuyelunaku = bahu karunaa
bharununaku - Prabhuvula Prabhuvunaku

|| Vandaname ||

2. Ashrita janapaalunaku - nakalusha varadehunaku = Ishraayel raaju
naku - Yehovaa neeku

|| Vandaname ||

3. Mariyaatanujunaku - mahima gambheerunaku = parishuddhaacharanunaku =
barameshwara neeku

|| Vandaname ||

4. Raajulapai raajunaku - ravikoti tejunaku = poojaarha padaabunaku -
bhuvanaavana neeku

|| Vandaname ||

5. Prema dayaa sindhunaku - kshemaamruta poornunaku = aame nani
saashtaangamu larpintumu neeku

|| Vandaname ||

––Purushottamu Choudhari

Comments