Vijayageetamul Paadare Kreestuku | విజయగీతముల్ పాడరే క్రీస్తుకు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.77 - రక్షకుని యందలి విజయము

విజయగీతముల్ పాడరే - క్రీస్తుకు జయ- విజయగీతముల్ పాడరే =

వృజిన మంతటి మీద - విజయ మిచ్చెడు దేవ- నిజకుమారుని నామ
మున్- హృదయములతో - భజన జేయుచు నిత్యమున్

॥ విజయ ॥

1. మంగళముగ యేసుడే- మనకు రక్షణ -శృంగమై మరి నిల్చెను- నింగిన్
విడిచి వచ్చెను-శత్రుని యుద్ధ-రంగమందున గెల్చెను=రంగు
మీరగదన- రక్తబలము వలన - పొంగు నణగజేసెను సాతానుని బల్-
క్రుంగ నలిపి చీల్చెను

॥ విజయ ॥

2. పాపముల్ దొలగింపను- మనలను దన స్వ- రూపంబునకు మార్చను -
శాపం బంతయు నోర్చెను- దేవుని న్యాయ కోపమున్ భరియించెను=
పాప మెరుగని యేసు -పాపమై మనకొరకు -పాపయాగము తీర్చెను-
దేవుని నీతిన్ - ధీరుడై నెరవేర్చెను

॥ విజయ ॥

3. సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన
వానికి-చెలువుగన్ విమలాత్ముని - ప్రేమను మనలో నిలువన్ జేసిన
వానికి -కొలువు జేతుమెగాని- ఇలను మరువక వాని- సిలువ మోయుచు
నీ కృపా- రక్షణ చాల విలువ గలదని చాటుచు

॥ విజయ ॥

––అల్లూరి పెదవీరాస్వామి

Vijayageetamul paadare - Kreestuku jaya-Vijayageetamul paadare =

vrujina mantati meeda - vijaya micchedu Deva-nijakumaaruni naama
mun-hrudayamulat o-bhajana jeyuchu nityamun

|| Vijaya ||

1. Mangalamu ga Yesude-manaku rakshana-shrungamai mari nilchenu-ningin
vidichi vacchenu-shatruni yuddha-rangamanduna gelchenu=rangu
meeragadan-raktabalamu valana-pongu nanagajesenu saataanuni bal-
krunga nalipi cheelchenu

|| Vijaya ||

2. Paapamul dolagimpanu-manalanu dana sva-roopambunaku maarchanu-
shaapam bantayu norchenu-Devuni nyaaya kopamun bhariyinchenu=
paapa merugani Yesu-paapamai manak oraku-paapayaagamu teerchenu-
Devuni neetin-dheerudai neraverchenu

|| Vijaya ||

3. Siluva maranamu nondiyu manalanu danakai geluvan lechina
vaaniki-cheluvugan vimalaatmuni-premanu manalo niluvan jesina
vaaniki-koluvu jetumegaani-ilanu maruvaka vaani-siluva moyuchu
nee krupaa-rakshana chaala viluva galadani chaatuchu

|| Vijaya ||

––Alluri Pedaveeraaswaami

Comments