Yesuni Bhajiyimpave Manasaa | యేసుని భజియింపవే మనసా | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.80 - క్రైస్తవ విశ్వాసమునకుం ట్రేరేపణ

యేసుని భజియింపవే మనసా- నీ దోసములు చనజేసి కృపతోబ్రోచునే

మనసా=వాసి కెక్కిన క్రీస్తు మోక్షాని-వాసిగా కిక వేరే లేరని- దోసి లొగ్గి
నుతించితే నిను-త్రోసి వేయడు దోసకారని

॥ యేసు ॥

1. ఏటికే నీ కీదురాశలు-నీకెప్పుడును చెవి-నాటవుగ ప్రభు యేసు
వాక్యములు=వాటముగ నాతుది దినమున- నీటు మీఱగ నిత్యజీవ కి -
రీటమును నీకిత్తు నని తన -నోట బల్కిన మాటదప్పడు

॥ యేసు ॥

2. ఖండనగ నిను చెండియాడడు - యెల్లప్పుడుం దనమిత్రుడని రక్షించు
నతడితడు = అండబాయక నిన్ను ప్రతి దిన గండములను హరించు
నని నీ-వుండ గోరిన నిండు నెమ్మది- దండిగ నీ కుండ జెప్పును

॥ యేసు ॥

3. లోక సైతాను దుర్బోధలు- నీ వాలింపక- యా- లోక రక్షకుని
సుబోధలు-ఏక మనసుతో రాత్రిబగలు ప-రాకులేకను గాచు నా
ప్రభు రాకడను నీ వెఱింగినను పర-లోకశుభ సుఖసౌఖ్య మొసగును

॥ యేసు ॥

4. వంచనలు మది నుంచకే మనసా-నీ-దుర్గుణము తలద్రుంచి
ప్రభుని సేవింపవే మనసా= అంచితముగా క్రీస్తుడీ ప్ర-పంచ జనుల
భవాబ్ధినావగ- నెంచి నీ భవభార మతనిపై- నుంచి సతము ప్రార్ధించు
మనసా

॥ యేసు ॥

5. నిన్ను పాప బంధముల నుండి- రక్షించుటకు -స-ర్వోన్నతుని కుమారుడై
వెలసి-ఎన్నగ నీ వొందు దుఃఖము-లన్నిటిని తా ననుభవించెను-విన్న
తక్షణ మేసుక్రీస్తుని - విశ్వసించి సుఖించు మనసా

॥ యేసు ॥

––రావూరి లక్ష్మయ్య

Yesuni bhajiyimpave manasaa-nee dosamulu chanajesi krupatobrochune

manasaa=vaasi kekkina Kreestu mokshaani-vaasigaa kika vere lerani-dosi loggi
nutinchite ninu-trosi veyadu dosakaarani

|| Yesu ||

1. Yetike nee keeduraashalu-neekeppudunu chevi-naatavuga Prabhu Yesu
vaakyamulu=vaatamuga naatudi dinamuna-neetu meeraga nityajeeva ki-
reetamunu neekittu nani tana-nota balkina maatadappadu

|| Yesu ||

2. Khandanaga ninu chendiyaadadu-yellappudum danamitrudani rakshinchu
nataditadu=andabaayaka ninnu prati dina gandamulanu harinchu
nani nee-vunda gorina nindu nemmadi-dandiga nee kunda jeppunu

|| Yesu ||

3. Loka saitaanu durbodhalu-nee vaalimpaka-yaa-loka rakshakuni
subodhalu-eka manasuto raatribagalu pa-raaku lekanu gaachu naa
Prabhu raakadan u ne veringinanu para-loka shubha sukha saukhya mosagunu

|| Yesu ||

4. Vanchanalu madi nunshake manasaa-nee-durgunamu taladrunchi
Prabhuni sevimpave manasaa=anchitamugaa Kreestudi pra-panchajanula
bhavaabdhi naavaga-nenchi nee bhavabhaara matanipai-nunchi satamu praarthinchu
manasaa

|| Yesu ||

5. Ninnu paapa bandhamula nundi-rakshinchutaku-sa-rvonnatuni kumaarudai
velasi-ennaga nee vondu duhkhamu-lannitini taa nanubhavinchenu-vinna
takshanamesuKreestuni-vishvasinchi sukhinchu manasaa

|| Yesu ||

––Raavoori Lakshmayya

Comments