Devuni Neeti Prataapam | దేవుని నీతి ప్రతాపం | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.96 - యేసు క్రీస్తు దేవుడు

1. దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం-సౌభాగ్యం దైవ జనుల హృదయానందం యేసు క్రీస్తు దైవసుతుండు యేసు క్రీస్తు మనుజసుతుండు యేసు క్రీస్తు దేవుండు యేసే ప్రభువు స్తుతి పాత్రుడు

2. అద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్జన మూర్తి ఆకస రాసుల అధిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత-అధినేత, అనుదిన కృపలిడు సుఖదాత

3. పాపము భయపడునామం పాపాత్ముడు కృపగను హోమం -పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాపక్షమాపణగానం- బహుమానం అనవరతమునిజబలిదానం

4. జనముల జీవాధిపతి జగమంతటి నేలెడిజ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్ములు క్రోలెడి నీతి జనన మరణ జయశీల- నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల

––ఏ.బి. మాసిలామణి

1. Devuni neeti prataapam bhuvi Yesuni silva prabhaavam Devula Devuni apuroopam bhuvi Yesuni naama swaroopam Deva Yehovaa suvaakyam-soubhaagyam daiva janula hrudayaanandam Yesu Kreestu daivasutundu Yesu Kreestu manujasutundu Yesu Kreestu Devundu Yese Prabhuvu stuti paatrudu

2. Adyanta rahita keerti avataara shramaarjana moorti aakasa raasula adhipati avani srujanaatma prateeti akhila prapanch pradaata-adhineta, anudina krupalidu sukhadaata

3. Paapamu bhayapadunaamam paapaatmudu krupaganu homam -patitula vedakina premaswaram paraloka sukhaala vihaaram paapakshamaapanagaanam-bahumaanam anavarata munijabalidaanam

4. Janamula jeevaadhipati jagamantati neledijyoti jeevula antima nyaayapati jeevaatmula kroleḍi neeti janana marana jayasheela-narapaala jagatini maarch edi shubha jvaala

––A.B. Maasilaamani

Comments