Kreestu Naayaka Nee | క్రీస్తు నాయక నీ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.90 - యేసు క్రీస్తునకు స్తుతి
క్రీస్తు నాయక నీ దయాళిని-కీర్యనలుగా బాడుదున్-నే స్తుతులతో దండ్రి దేవుని-నిత్యమును గొండాడుదున్
॥ క్రీస్తు ॥
1. సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటుకు నోరాడదు =అలుకు నొందకు స్వామి నీ ది=వ్యాంఫ్రి చెంతను గూడుదు
॥ క్రీస్తు ॥
2. నిమిషమైన న్యాయ కెదలో - నిన్ను నే స్మరియింతును=అమితమౌ దేవానుక్రోశము -హర్షముగ వర్ణింతును
॥ క్రీస్తు ॥
3. యేసు ప్రభు నా కాల మంతయు-నేమఱక నీ నామము=దాసునిగ భజియింతు నిక నే-దప్పకుండను నీమము
॥ క్రీస్తు ॥
4. చచ్చి నేనరుదెంచి మోక్షము-స్వామి నీ యుపకారముల్ = హెచ్చు ప్రేమను బాడుచుందును-యెప్పుడును గైవారముల్
॥ క్రీస్తు ॥
5. మలినమౌ నా నత్తి నాల్క-స-మాధిలో గృశియింపను= బలిమితో నేబాడుచుందును-భక్తి యుజ్వలింపను
॥ క్రీస్తు ॥
6. కన్నుమూతలుగాను నీ సముఖంబు కేను బిరాలను-తెన్ను తప్పక వత్తు శ్రీకర-దేవ నను నీ వేలను
॥ క్రీస్తు ॥
7. ముగ్గురొకడై వెల్గుచుండెడి- మోక్షరాజ్య గరిష్ఠుడా= యొగ్గు చేయక నన్ను బ్రోవవే-యేసునాధా మహేశుడా
॥ క్రీస్తు ॥
8. భూతలములో నీ సమానముబోల్చ నేదియుగానము= దాయవై మము సలుపవే నీ- తండ్రికిని సంధానము
॥ క్రీస్తు ॥
––మిక్కిలి సమూయేలు
Kreestu naayaka nee dayaalini-keertanalugaa baadudun-ne stutulato tandri Devuni-nityamunu gondaadudun
|| Kreestu ||
1. Siluva mosina nee prayaasanu jepputaku nooraadadu=aluku nondaku Swaami nee di-vyaamphri chentanu goodudu
|| Kreestu ||
2. Nimishamaina nyaaya kedalo-ninnu ne smariyintunu=amitamau Devaanukroshamu-harshamuga varnintunu
|| Kreestu ||
3. Yesu Prabhu naa kaala mantayu-nemaraka nee naamamu=daasuniga bhajiyintu nika ne-dappakundanu neemamu
|| Kreestu ||
4. Chachchi nenarudenchi mokshamu-Swaami nee yupakaaramul=hechchu premanu baaduchundunu-yeppudunu gaivaaramul
|| Kreestu ||
5. Malinamau naa natti naalka-sa-maadhilo grushiyimpanu=balimito nebaaduchundunu-bhakti yujvalimpanu
|| Kreestu ||
6. Kannumootalugaanu nee samukhamu kenu biraalanu-tennu tappaka vattu Sreekara-Deva nanu nee velanu
|| Kreestu ||
7. Muggurokadai velguchundedi-moksharaajya garishthudaa=yoggu cheyaka nannu brovave-Yesunaadhaa Maheshudaa
|| Kreestu ||
8. Bhootalamulo nee samaanamubolcha nedi yugaanamu=daayavai mamu salupave nee-tandrikini sandhaanamu
|| Kreestu ||
––Mikkili Samuyelu
Comments
Post a Comment