Naa Rakshakaa Yesunaadhaa | నా రక్షకా యేసునాధా | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.91 - క్రీస్తునకు స్తుతి
నా రక్షకా యేసునాధా ఇమ్మానుయేలు - ఘోర పాపుల పాప భార విమోచక
॥ నా రక్షకా ॥
1. నిత్యకాలమునందు- నిజమైన దేవుని=సత్యవాక్యమై యున్న- స్వామి నిన్నుతియింతు
॥ నా రక్షకా ॥
2. సర్వ లోకంబులను-సత్యవాక్యమై యుండి - నిర్వహించిన దేవుని-నిజబాహువా స్తుతింతు
॥ నా రక్షకా ॥
3. దేవజనులకు- సువార్త దెలుప ననిషేకంబు=పూని నొందిన దేవ పుత్రుడ నుతియింతు
॥ నా రక్షకా ॥
4. దేవ మహిమ ప్రకాశ-దీనరక్షక మాను- ష్యావతారముదాల్చి-యావదాజ్ఞల దీర్చిన
॥ నా రక్షకా ॥
5. పావనాద్భుతుడవై-పరమ జ్ఞానము దెల్పిన- దేవస్వభావ ముద్ర-దేదీప్యుడా స్తుతింతు
॥ నా రక్షకా ॥
6. పాపాత్ములను గావ-శాపభారము క్రింద= నోపికతో నిల్చి-ప్రాపు జూపిన ప్రభువా స్తుతింతు
॥ నా రక్షకా ॥
7. ఈ వసుధను ప్రేమ-నెసగునట్లుగ జూపి= చావు గెల్చిన సర్వ సామర్థ్యుడా
॥ నా రక్షకా ॥
8. ఘన దేవుని కుడి పార్శ్వమున గూర్చుండి విజ్ఞప్తి- నొనరించు నా యేసు -వినయ స్తోత్రంబిదిగో
॥ నా రక్షకా ॥
––తిరుకోవళ్లూరి స్టీవెన్
Naa rakshakaa Yesunaadhaa Immaanu yelu-ghora paapula paapa bhaara vimochaka
|| Naa rakshakaa ||
1. Nityakaalamunandu-nijamaina Devuni=satyavaakyamai yunna- Swaami ninnutiyintu
|| Naa rakshakaa ||
2. Sarva lokambulanu-satyavaakyamai yundi-nirvahinchina Devuni-nijabaahuvaa stutintu
|| Naa rakshakaa ||
3. Devajanulaku-suvaarta delupa nanishekambu=pooni nondina Deva putruda nutiyintu
|| Naa rakshakaa ||
4. Deva mahima prakaasha-deena rakshaka maanu-shyaavataaramu daalchi-yaavadaajnala deerchina
|| Naa rakshakaa ||
5. Paavanaadbhutudavai-parama jnaanamu delpina-Devasvabhaava mudra-dedeepyudaa stutintu
|| Naa rakshakaa ||
6. Paapaatmulanu gaava-shaapabhaaramu krinda=nopikato nilchi-praapu joopina Prabhuvaa Stutintu
|| Naa rakshakaa ||
7. Ee vasudhanu prema-nesagunatluga joopi=chaavu gelchina sarva saamarthyudaa
|| Naa rakshakaa ||
8. Ghana Devuni kudi paarshvamuna goorchundi vignapti-nonarincu naa Yesu-vinaya stotrambidigo
|| Naa rakshakaa ||
––Tirikovvaḷḷoori Steven
Comments
Post a Comment