Yesu Padaambuja Sharanam | యేసు పదాంబుజ శరణం | Andhra Kraistava Keerthanalu
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Song No.92 - యేసు శరణు
యేసు పదాంబుజ శరణం- నర-దోష మహాంబుది- హరణం=యేసే మార్గము యేసే సత్యము-యేసే జీవము యేసుకు-శరణం
1. దేవకుమారశరణం -నర-జీవ ప్రదాత-శరణం= దేవదేవ జగదవతార మము-బ్రోవరావె ప్రభునీవే శరణం
2. పాపవినాశక శరణం- నర శాపవిమోచక శరణం = పావనాత్మ భవదీయ ప్రాణమిడి-ప్రాపునైతివో ప్రభువా-శరణం
3. పరమపురుషుడా శరణం- ఓ నిరుపమ ప్రేముడ-శరణం= మరణ మొంది మరి మృత్యుంజయుడై-పరమున కరిగిన ప్రభువా శరణం
4. నీతి పూర్ణమా శరణం -జగ-జ్యోతి రత్మమా - శరణం -జాతిభేద రాహిత్యుడ హితుడా- నీతి ప్రబోధక నీవే శరణం
5. తేజోమూర్తికి శరణం- విభ్రాజిత కీర్తికి-శరణం- రాజరాజయో భారత రాజ- ప్రజాత్మ రక్షక ప్రభువా శరణం
––చెట్టి భానుమూర్తి
Yesu padaambuja sharanam-nara-dosha maambudi-haranam=Yese maargamu Yese satyamu-Yese jeevamu Yesuku-sharanam
1. Devakumaara sharanam-nara-jeeva pradaata-sharanam=Deva Deva jagad avataara mamu-brovaraave Prabhu neeve sharanam
2. Paapa vinaashaka sharanam-nara shaapa vimochaka sharanam=paavanaatma bhavadeeya praanamidi-praapunaitivo Prabhuvaa-sharanam
3. Paramapurushudaa sharanam-o nirupama premuda-sharanam=maranamon di mari mrutyunjayudai-paramuna karigina Prabhuvaa sharanam
4. Neeti poornamaa sharanam-jaga-jyoti ratmamaa-sharanam-jaatibheda raahityuda hitudaa-neeti prabodhaka neeve sharanam
5. Tejomurtiki sharanam-vibhraajita keertiki-sharanam-raajaraajayo bhaarata raaja-prajaatma rakshaka Prabhuvaa sharanam
––Chetti Bhaanumoorti
Comments
Post a Comment