Yesukreestudu Nitya Devudu | యేసుక్రీస్తుడు నిత్య దేవుడు | Andhra Kraistava Keerthanalu

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు

Song No.95 - క్రీస్తు దైవత్వము

యేసుక్రీస్తుడు నిత్య దేవుడు - ఎఱిగి నమ్ముడి మనుజులారా= మోస మొందక మోక్షపతికిక దాసులై బ్రతుకండి రండి

॥ యేసు ॥

1. ఆరుదినములలో వలనే యాకసము భూలోకములను= ప్రాకటముగజేసి నాడు - ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు

॥ యేసు ॥

2. ఆది పురుషుని యాది స్త్రీనిక-హస్తములతో నంటి చేసెను=మేదినిన్ ఫలవనములోన-సాధులై నివసింప నిచ్చెను

॥ యేసు ॥

3. వార లిద్దఱు దేవునాజ్ఞను- కోరికలతో మీరినప్పుడు = గారడీ పిశాచ తంత్రము-వారి పరమై పాపులైరి

॥ యేసు ॥

4. వీరలందఱు వారి సంతతి-సేరె లేరీ ధరణిలోదు=ష్కార్యులై దేవుని యాజ్ఞలు- మీరి రందఱు నరక పాత్రులు

॥ యేసు ॥

5. ఇంత పాపభరితులై కా- సంతసత్యము లేని నరుల= నెంతగా బ్రేమించెనో తన-సొంత ప్రాణము బలిగబెట్టెను

॥ యేసు ॥

6. పాపమించుక లేని కరుణా- పావనుడు నరుడాయెను= శాపగ్రస్తుల మైన మన-శాపములు తాజేత బూనెను

॥ యేసు ॥

7. ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందె నిలను= ఎన్నడు నీలాటి ప్రేమ-వన్నెలేదో యన్నలారా

॥ యేసు ॥

8. మనలబాపమునుండి బాపను- మనుజుడై మరణంబునొంది మన ప్రభువె మూడవ దినంబున మహిని లేచి పరము వెళ్లెను

॥ యేసు ॥

––గొల్లపల్లి నతానియేలు

Yesukreestudu nitya Devudu-erigi nammudi manujulaaraa=mosamondaka mokshapatikika daasulai bratukandi randi

|| Yesu ||

1. Aarudinamulalo valane yaakasamu bhoolokamulanu= praakatamugajesi naadu-prakaashudaayana prajnnavantudu

|| Yesu ||

2. Aadi purushuni yaadi streenika-hastamulato nanti jesenu=medinin phalavanamulona-saadhulai nivasimpa nichchenu

|| Yesu ||

3. Vaara lidda ru Devunaajnanu-korikalato meerinappudu=gaaradi pishaacha tantramu-vaari paramai paapulairi

|| Yesu ||

4. Veeralandaru vaari santati-sere leri dharanilodu=shkaaryulai Devuni yaajnal u-meeri randaru naraka paatrulu

|| Yesu ||

5. Inta paapabharitulai kaa-santasatyamu leni narula=nentaga breminch en o tana-sonta praanamu baligabett enu

|| Yesu ||

6. Paapam inchuka leni karunaa-paavanudu narudaayenu=shaapagrasthula maina mana-shaapamulu taajeta boonenu

|| Yesu ||

7. Ennarani baadhalondutu punyaraktamu jinde nilanu=ennadu neelaati prema-vannel edo yannalaaraa

|| Yesu ||

8. Manalabaapamunundi baapanu-manajudai maranambunondi mana Prabhuve moodava dinam bun mahaani lechi paramu vellen u

|| Yesu ||

––Gollapalli Nataaniyelu

Comments