Posts

Goppa Deva Naaku | గొప్ప దేవ నాకు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.60 - తండ్రియగు దేవుడు నీవు నాతండ్రివి గొప్ప దేవ నాకు తండ్రివు-యాకాశమందు- గొప్ప దేవ నాకు దండ్రివి = తప్పకుండ వత్తు నీ-దరికి యేసు నామమందు-గొప్ప కరుణచేత న- న్నిప్పుడు తగజేర్చుకొనుము ॥ గొప్ప ॥ 1. నీవు మిగుల గొప్ప వాడవు నా సృష్టి కర్త -యీవు లెపుడు నిచ్చు వాడవు= భావమందు నిను దలంచి- పావనాత్మ నాకు నిచ్చి- జీవమార్గ మందు నిలిపి- కావు మనుచు వేడుకొందు ॥ గొప్ప ॥ 2. చిన్న వాని నంగి ప్రార్ధన-నీలోకమందు-మున్ను దయను విన్న వాడవు = సన్నుతుడగు యేసు నీదు - సన్నిధి నున్నాడు గాన-నన్ను గనికరించు మనుచు- నిన్ను నమ్మి వత్తు నిపుడు ॥ గొప్ప ॥ 3. విలువ గల్గు నీదు నాజ్ఞలు- నాహృదయమందు -బలువిధముల దలచు చుందును= బలుకులందు బనులయందు- బలముజూపి నిన్ను గొలిచి-యిలనునిన్ను బ్రీతి పరతు- నలయక నీ కరుణ మెయిని ॥ గొప్ప ॥ 4. మీది రాజ్యమందు జేర్చుము- కరుణా సముద్ర -బీద నైన నన్ను గరుణచే= సోదరులను గూడికొనుచు-మోద మొప్పగ నీదు సేవ- బాదుకొనుచు నుందును నీ పాదపద్మములను బట్టి ॥ గొప్ప ॥ ––పులిపాక జగన్నాధము Goppa Deva naaku tandrivu-aakaashamandu-goppa Deva naaku dandrivi = Ta...

Sukshēma Shubhakaala | సుక్షేమ శుభకాల | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.59 - సుక్షేమ శుభకాల 1. సుక్షేమ శుభకాల విశ్రాంతి దినమా విచార మెల్ల తీర్చు దైవాదివారమా ఈనాడు మేము కూడి దేవాలయంబున యా త్ర్యేక దేవ స్తుతి గావింతు మెంతయు 2. నీయందు సృష్టికర్త విశ్రమ మొందెను నీయందు యేసు క్రీస్తు మృత్యు బంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెన్ నీ యందు పావనాత్మ మాకియ్య బడెను 3. భూవాసు లీ దినంబు సంతోష పడుచు సువార్తవిని, పాడి మా యేసు స్తోత్రము పితృ పుత్ర శుద్ధాత్మ త్రిత్వంబౌ దేవుని ఉత్సాహ ధ్వనితోడ నెంతో స్తుతింతురు. అను: జాకబ్ చేంబర్లేన్ ––క్రిష్టఫర్ వర్డ్స్ వర్త్ 1. Sukshēma shubhakaala Vishraanti dinamaa Vichaara mella teerchu Daivaadivaaramaa Eenaadu memu koodi Devaalayambuna Yaa tryeka Deva stuti Gaavintu mentayu 2. Neeyandu Srushtikarta Vishrama mondenu Neeyandu Yesu Kreesthu Mrutyu bandhamunu Trenchuchu taanu lechi Chaavun jayinchen Nee yandu Paavanaatma Maakiyya badenu 3. Bhoovaasu lee dinambu Santosha paduchu Suvaartavini, paadi Maa Yesu stotramu Pitru putra Shuddhaatma Trittvambou Devuni Utsaaha dhvan...

Idi Yehovaa Kaliginchina | ఇది యెహోవా కలిగించిన | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.58 - ప్రభునికైన ప్రత్యేక దినములు ప్రభు దినము ఇది యెహోవా కలిగించిన దినము = సుదివసంబునను-జొప్పడు గడియలు-కొదువలేని దయ-గుల్కెడు వానివి 1. మోక్షము భూమియు స-మ్మోద మంది నుతు = లక్షరు గద్దె చుట్టు నాక్రమింతురు గాక 2. అతడీ దినమం-దంత మొందు సర= వితతి నుండి వే-వేగ వచ్చెను 3. ఆ పిశాచ రా-రాజ్యంబు కూలినది = ఆ పరేశు విజ-యము లీ దినమున 4. సేవక వరులు విల-సింపగ జేసి యా= పావనాద్భుతముల- బ్రచురముజేయుదు 5. దావీదుని వర-తనయుడై యభిషే=కావృతుడౌ రాజా- గ్రణికి హోసన్నా ––పురుషోత్తము చౌధరి Idi Yehovaa kaliginchina dinamu = Sudivasambunanu-joppadu Gadiyalu-koduvanileni daya-gulkedu vaanivi 1. Mokshamu bhoomiyu sa-mmooda mandi nutu = Laksharu gadd e chuttu naakraminturu gaaka 2. Atadee dinamam-danta mondu sara= Vitat i nundi ve-vega vachchenu 3. Aa pishaacha raa-raajyambu koolinadi = Aa Pareshu vija-yamu lee dinamuna 4. Sevaka varulu vila-simpaga jesi yaa= Paavanaadbhutamula- brachuramu jeyudu 5. Daaveeduni vara-tanayudai yabhishe-kaavritudau...

O Rakshakaa, Nee | ఓరక్షకా, నీ దివ్యనామము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.57 - Saviour, again to thy dear Name we raise 1. ఓరక్షకా, నీ దివ్యనామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మొందు వేళయం దనుగ్రహించు నీదు దీవెనన్ 2. గృహంబు జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుముసదా ఇచ్చట సేవ జేయు మమ్మును పాపంబు జేయుకుండగాయుము 3. మా చుట్టునుండు మబ్బునప్రభో ని దివ్యకాంతిన్మాకునియ్యుమా పాపాంధకార బాధనుండి నీ బిడ్డల మైన మమ్ముబ్రోవుమా ––జాన్ ఎల్లెర్టన్ అను: బర్నాల్డ్ లూకాస్ 1. O Rakshakaa, nee divyanaamamu Aikyambutonu stutiyintumu Aaraadhanaanta mondu velayam Danugrahinchu needu deevenan 2. Gruhambu jera naatma shaantini Osangi maato nundumusadaa Ichchata seva jeyu mammunu Paapambu jeyukundagaayumu 3. Maa chuttunundu mabbuna Prabho Nee divyakaantin maakuniyyumaa Paapaandhakaara baadha nundi nee Biddala maina mammu brovumaa ––Jaan Ellerton Anu: Barnald Lukas

Raatriyaye Nannedabaayaku | రాత్రియయ్యె నన్నెడబాయకు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.56 - Abide with me, fast falls the eventide 1. రాత్రియయ్యె నన్నెడబాయకు ధాత్రిపై జీకటులు గ్రమ్మెను సహాయ మేమి లేనివారికి సహాయుడా, నన్బాసిపోకుమీ. 2. ఏకాలంబైన నీ సహాయము లేక పిశాచిన్ గెల్వజాలను నీకంటె దిక్కు నాకు లేదుగా లోక ప్రకాశుడా నన్బాయకు. 3. నా చెంత నీవు చేరియుండగ ఏ చింతయైన నన్నుసోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా నా శైలమా, నన్బాసి పోకుమా. 4. సమృద్ధుడు సహాయుడాయెను ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయ మబ్బునా? మామధ్యమున్ సర్వేశపాయకు. 5. రేవు నే జేరబోవు వేళలోన్ కావుమయ్యా నీదీప్తి జూపుచున్ చావు జీవంబులందు నైనను నీవు తోడై నన్బాసి పోకుము. ––హెన్రీ ప్రాన్సిస్ లైట్ 1. Raatriyaye nannedabaayaku Dhaatripai jeekatulu grammenu Sahaaya memi lenivaariki Sahaayudaa, nanbaasipokumi. 2. Ekaalambaina nee sahaayamu Leka pishaachin gelvajaalanu Neekante dikku naaku ledugaa Loka prakaashudaa nanbaayaku. 3. Naa chenta neevu cheriyundaga Ye chintayaina nannusokunaa Ye shatruvaina nannu gelchunaa Naa shailamaa, nanbaasi pokumaa. 4. ...

Proddu Grunkuchunnadi | ప్రొద్దు గ్రుంకుచున్నది | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.55 - Day is dying in the west ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 1. ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెల్గింపగా స్తుతించుడి ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 2. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండగాను మా కీ వొసంగు నీ కృపన్ నిత్యోదయం ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ 3. నిన్ను గోరువారము సన్ను తేశ నీ దరిన్ మమ్ముజేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు. ॥ శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుడా ఇద్దరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా ॥ ––మేరి లాల్బరీ. అను: ఒంగోలు దావీదు || Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnataa || 1. Proddu grunkuchunnadi Saddanangu chunnadi Yaakasambu divvelu Lokamun velgimpagaa Stutinchudi || Shuddha, Shuddha, Shuddha Sarveshudaa Iddar aakaashambulu Sannutinchuchunnavi Sarvonnat...

Naa Yesoo, Aatma | నా యేసూ, ఆత్మ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.54 - Sun of my soul, thou Saviour dear 1. నా యేసూ, ఆత్మ సూర్యుడా నీవున్న రాత్రి కమ్మదు నా యాత్మలో నీ విప్పుడు వసించి పాయకుండుమీ. 2. నేను నిద్రించు వేళలో నాకు నభయ మియ్యుము నే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షకా. 3. నా తోడ రాత్రింబగళ్ళు నీ వుండి నడిపించుము నీవు నాతో లేకుండినన్ జీవింప జావజాలను. 4. నేడు నీ దివ్య వాక్యము వినిన పాపు లెల్లరిన్ క్షమించి గుణపరచి నీ మందలోకి జేర్చుము. 5. రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమీ దుఃఖించువారి దుఃఖము బాపి యానంద మియ్యుము. ––జాన్‌ కేబిల్‌, అను; జాకబ్‌ చేంబర్లేన్‌ 1. Naa Yesoo, aatma Sooryudaa Neevunna raatri kammadu Naa yaatmalo nee vippudu Vasinchi paayakundumi. 2. Nenu nidrinchu velalo Naaku nabhaya miyyumu Ne lechi pani cheyagaa Naa yodda nundu Rakshakaa. 3. Naa toda raatrimbagallu Neevundi nadipinchumu Neevu naato lekundinan Jeevimpa jaavajaalanu. 4. Nedu nee divya vaakyamu Vinina paapu lellarin Kshaminchi gunaparachi Nee mandaloki jerchumu. 5. Rogini svasthaparachi Beedhalanu p...

Ee Saayamkaalamuna | ఈ సాయంకాలమున | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.53 - సాయంతన ప్రార్థన ఈ సాయంకాలమున -యేసు ప్రభో వేడెదము = నీ సుదయారస మొల్క - నిత్యంబు మము గావు ॥ ఈ ॥ 1. చెడ్డకలల్ రాకుండ- నడ్డగించుము ప్రభో=బిడ్డలము రాత్రిలో-భీతి బాపుము తండ్రీ ॥ ఈ ॥ 2. దుష్టుండౌ శోధకుని -ద్రొక్కుటకు బలమిమ్ము- భ్రష్టత్వమున మేము - పడకుండా గాపాడు ॥ ఈ ॥ 3. నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున -సాయంప్రార్ధన లెల్ల -సరగ నాలించుమా ॥ ఈ ॥ 4. జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతు- అనిశము జీవించి రా జ్యంబు జేయు మామేన్ ॥ ఈ ॥ ––మల్లెల దావీదు Ee saayamkaalamuna-Yesu Prabho vededamu= Nee sudayaarasa molka-nityambu mamu gaavu || Ee || 1. Cheddakalal raakunda-naḍḍaginchumu Prabho=Biḍḍalamu raatrilo-bheethi baapumu Tandri || Ee || 2. Dushtundau shodhakuni-drokkutaku balamimmu-bhrashtatvamuna memu-padakunda gaapaadu || Ee || 3. Nee yeka putrundau-Sri Yesu naamamuna-saayam praarthana lella-saraga naalinchumaa || Ee || 4. Janaka suta Shuddhaatma-ghanadevaa stutiyintu-anishamu jeevinchi raajyambu jeyu maamen ...

Aakaashambu Bhumiyu | ఆకాశంబు భూమియు | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.52 - సాయంతన ప్రార్థన ॥ ఆకాశంబు ॥ 1. ఆకాశంబు భూమియు- అంతట చీకటి యాయెను=ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా ॥ ఆకాశంబు ॥ 2. చక్కని చుక్కలు మింటను- చక్కగ మమ్మును జూడగ= ప్రక్కకురావె వేగముగా - ప్రభువా గావుము నీ నీడన్ ॥ ఆకాశంబు ॥ 3. చిన్న చిన్న పాపలు- చిన్న చిన్న పూవులు- ఎన్నో ఎన్నో జీవులు-నిన్నే గొలిచి నిద్రించున్ ॥ ఆకాశంబు ॥ 4. చిన్ని చిన్ని పాపలు- చిన్ని చిన్ని పడకలలో = చిన్ని కన్నులు మూయంగా -చెన్నుగ యేసుగావుమా ॥ ఆకాశంబు ॥ 5. నేలను బోయెడి బండ్లలో -నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబుల లోన- కావుము దేవ ప్రయాణికులన్ ॥ ఆకాశంబు ॥ 6. రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో = చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్- నిద్రించెదము మా దేవా ॥ ఆకాశంబు ॥ 7. తెల్లవారుజామున- తెలివొంది మేమందరము = మెల్లగలేచి నుతియింపన్- మేల్కొల్పుము మా ప్రియతండ్రి ॥ ఆకాశంబు ॥ 8. జనక తనయా శుద్ధాత్మా- ఘనత మహిమ స్తోత్రములు= అనిశము నీకే చెల్లునుగా- అనిశము చెల్లును నీకామెన ॥ ఆకాశంబు ॥ ––ఏ.చార్లెస్ క్సింగర్ || Aakaashambu || 1. Aakaashambu bhumiyu- antata ...

Dinamu Gatiyinchenu | దినము గతియించెను | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.51 - సాయంతన స్తవము దినము గతియించెను-దిన నాధుడ పరాద్రి- వెనుకడాగె-నికమా- మునిమాపు సంస్తవముగొనుము సంప్రీతిమై-ఘనుడ దేవా ॥ దినము ॥ 1. సరవి నంబరవీధి - సంజ కెంజాయలు- మురువుజూపె- ప్రభువా- దొరయు నీ ముఖకాంతి-కిరణ జాలము మాపై-నెఱప రమ్ము ॥ దినము ॥ 2. కటికిచీకటులు ది-క్తటముల గలిసియు-త్కటములైన-నీ-చెం- గట నున్న నెట్టి సం-కటమేని మమ్ము- దాకుటకు జంకు ॥ దినము ॥ 3. తలపు వలనను నోటి-పలుకు వలనను జెనటి-పనులవల్ల-మేము- వలసి చేసిన పాప-ముల నెల్ల క్షమియింపు-మ లఘుక్షాంతి దినము ॥ దినము ॥ 4. మమ్మురమ్మగు శోధ- నమ్ములపై విజ-యమ్ము నొందనీ- దినమ్ము మాకు సామర్థ్య మొసగితివి వంద-నమ్ము దేవ ॥ దినము ॥ 5. ఈ దినము మాకు స-మ్మోదంబుతో నిచ్చి- యాదుకొన్న- వరమౌ నీ దివ్యదానముల-కై దేవ! మాకృత-జ్ఞతను గొమ్ము ॥ దినము ॥ 6. అలసిన మా దేహములకు వలసిన నిదుర గలుగజేసి - నీ దూ-తల హస్తములలో మ-మ్ములను దాచుము భద్ర-ముగను దేవ ॥ దినము ॥ 7. అరుణోదయమున ని-న్నర్చించు కొఱకు నీ-కరము సాచి-మమ్ము- త్వరగా మేల్కొల్పుము-స్వాస్థ్య ప్రదాతవై-పరమదేవ ॥ దినము ॥ 8. దాత వీవె లోక- త్రాత-వీవె మాకు-నేత వీవె-యేసు-న...

Deva Neeku Stotramu | దేవ నీకు స్తోత్రము | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.50 - సాయం ప్రార్థన దేవ నీకు స్తోత్రము- ఈ రాత్రిలో -నీ వెలుగు దీవెనకై=కావుము నన్నిప్పుడు -రాజుల రాజా- ప్రోవు రెక్కల నీడలో ॥ దేవ ॥ 1. పూని యేసుని పేరిటన్-మన్నించుము-కాని పనులను జేసినన్= నేను నిదురపోవక ముందే సమా=ధాన మిమ్ము నాకు ॥ దేవ ॥ 2. చావు నొందు కెన్నడు-భీతి లేక-జీవింప నేర్పించుము-జీవ పునరుత్థానము -లో మహిమతో- లేవ మడియ నడ్పుము ॥ దేవ ॥ 3. నేను జీకటి నిద్రను- రోయుచు దుద-లేని దినంబునందు= మాన కుండగ దూతలన్-గూడి చేయ-గాన మెప్పుడు గల్గునో ॥ దేవ ॥ ––మత్తయి సమూయేలు Deva neeku stotramu- Ee raatrilo- Nee velugu deevenakai= Kaavumu Nannippudu-Raajula Raajaa-Provu rekkala needalo || Deva || 1. Pooni Yesuni peritan-manninchumu-Kaani panulanu jesinan= Nenu nidurapovaka munde sama=dhaana mimmu naaku || Deva || 2. Chaavu nondu kennadu-bheethi leka-jeevimpa nerpinchumu-Jeeva punarutthaanamu-lo mahimato-leva madiya nadpumu || Deva || 3. Nenu jeekati nidranu-royuchu duda-leni dinambunandu= Maana kundaga dootalan-goodi jeya-gaana ...

Vinave Naa Vinati | వినవే నా వినతి | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.49 - సాయంతనారాధన సాయంతన సమర్పణము వినవే నా వినతి నివేదన దయ- వెలయగ నో ప్రభువా= నిను శరణాందితి నను గుశలంబున- నునుపవె యో ప్రభువా ॥ వినవే ॥ 1. నిర్మల గతి సంధ్యా కాలంబున- నీ స్తవ మగు ప్రభువా= ధర్మదీప్తి నా కొసగి చేయు-దీప్తవంతునిగ నన్ను ॥ వినవే ॥ 2. నీ మహాదాశ్రయ మొసంగి దుర్గతిని- నేబడకుండగను= నామది తన్వాది సమస్తముతో-ననుగావవె ప్రభువా ॥ వినవే ॥ 3. ఎన్ని దినంబులు జగతి నున్న నీ-కన్న వేరే గలవా= పన్నుగ మది నీ పదసంగతమై- యున్నది రేపగలు ॥ వినవే ॥ 4. పాప కరుండను నే సుకృతా-పాది కర్మ మెఱుగ = నీ పాద సరోజము నాకొసగుము- నాపై నీ కృపజెలగ ॥ వినవే ॥ 5. నీ కొరకై నామనము దృఢంబౌగాక యేసుప్రభువా= నాకు బిశాచముచే భ్రమ జన్మము-గాకుండగ నేలు ॥ వినవే ॥ ––మిక్కిలి సమూయేలు Vinave naa vinati nivedana daya-velayaga no Prabhuvaa= Ninu Sharanaanditi nanu gushalambuna-nunupave yo Prabhuvaa || Vinave || 1. Nirmala gati sandhyaa kaalambuna-nee stava magu Prabhuvaa= Dharma deepti naa kosagi cheyu-deeptavantuniga nannu || Vinave || 2. Nee mahaadaashraya mo...

Stotramu Stotramu O | స్తోత్రము స్తోత్రము ఓ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.48 - ఉదయ గీతి స్తోత్రము స్తోత్రము ఓ దేవా- ఈ వేకువనే-స్తోత్రము జేతుము మా దేవా= రాత్రి యందున మమ్ము రక్షించి గాపాడి- ధాత్రి మరియొక దినమున్= దయతో నిచ్చిన దేవా ॥ దేవా ॥ 1. పాప శోధనల నుండి- ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య= ఏక పాపము మమ్మున్- ఏల నియ్యకుండ- మాపు రేపులు మమ్ము-మనిపి బ్రోవుమయ్య ॥ దేవా ॥ 2. కన్న తండ్రి కంటెను- కనికరమున-కాపాడెడి మా దేవా= అన్న దమ్ములవలె మే మందరిని ప్రేమించి-మన్ననతో నీ దినము-మన నియ్యుమో ॥ దేవా ॥ 3. పితా సుతా శుద్ధాత్మ-లనెడి దేవా- ప్రీతితో గావుమయ్యా= నీతి మార్గములందు నిరతము మముగాచి-ఖ్యాతిగా నీ కొరకు బ్రతుకనిమ్మో ॥ దేవా ॥ ––బన్యన్ జోసఫ్ Stotramu Stotramu O Devaa- Ee vekuvane-Stotramu jetumu maa Devaa= Raatri yanduna mammu rakshinchi gaapaadi- Dhaatri mariyoka Dinamun- Dayato nichchina Devaa || Devaa || 1. Paapa shodhanala nundi-Prabhuvaa mammu kaapaadi brovumayya= Eka Paapamu mammun-Ela niyyakunda-maapu repulu mammu-manipi Brovumayya || Devaa || 2. Kanna tandri kantenu-Kanikaramuna-kaapaadedi maa...

Lechi Stutimpaboonudi | లేచి స్తుతింపబూనుడి | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.47 - ప్రాతఃస్తము లేచి స్తుతింపబూనుడి-లోకేశ్వరుని -లేచి స్తుతింపబూనుడి = లేచి స్తుతించెదము-చూచుచు మనలను -బ్రోచి ప్రేమతో గరము- జాచి కాపాడు విభుని ॥ లేచి ॥ 1. రాత్రి జాముల యందున - రంజిలదన - నేత్రము తెరచినందున = మైత్రితో దేవదయకు పాత్రుల మైతిమి- శ్రోతముల కింపునబ-విత్ర గీతము పాడుచు ॥ లేచి ॥ 2. నిదురబోయిన వేళను- నిర్మలమైన -హృదయము మనకు నియ్యను =ముదముతో నిదురబొంది యుదయాన లేచితిమి-సదయుడైన క్రీస్తు - పదముల దరిజేరి ॥ లేచి ॥ 3. నిగమ వేద్యుడు మనలను-దనలోన నీ-పగలు కాపాడబూనెను= దిగులు బొందక పనులు- తెగువతో జరుపుకొనుచు-వగపుతో లేచి మ్రొక్కి-మిగుల శుద్ధాత్మ నడిగి ॥ లేచి ॥ 4. నేటి పాఠము యందు-నిర్భయముగ-దాటి వెలసి యుందు=సూటిగ నీదు టెక్కల-చాటుగను నిలుపు మనుచు-నీకుగా నెల్లవార-నిత్యము ప్రేమ నేల ॥ లేచి ॥ Lechi stutimpaboonudi-Lokeswaruni-Lechi stutimpaboonudi = Lechi stutinchedamu-choochuchu manalanu-brochi premato garamu- Jaachi kaapaadu Vibhuni || Lechi || 1. Raatri jaamula yanduna-ranjiladana-netramu terachinanduna = Maitrito Devadayaku paatrula ma...

Prabhuvaa Ninnaaraadimpanu | ప్రభువా నిన్నారాధింపను | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.46 - ఉదయారాధన ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపగా దేవా నేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగను ప్రభాకరముగను- విరియు నీ తేజంబెలర్పగ - నభి దనంబులగూడి భక్తిని- యాత్మతో సత్యంబు తోడను ॥ ప్రభువా ॥ 1. 1.ఇరులుం గమ్మిన నుండి- యరుణోదయము దనుక- సరిగాపునీవేకాదా- దేవా రాత్రి- యరిగాపు నీవే గాదా= విరివిగా మా హృదయ సీమల- నెరసి యుండిన చీకటులు బో- దరిమి శాంతంబైన మనసుల-దయ బ్రసాదింపను భజింతుము ॥ ప్రభువా ॥ 2. అనఘా నీ సాన్నిధ్య-మున నుండగా మా దు-ర్మనసుల నరికట్టుమో- దేవా మాదుర్మనసుల శుచి జేయుము=వినయ భయభక్తులుదలిర్పగ వినుచు నీ వాక్యోపదేశము -లనిశమును ధ్యానింప నాత్మను- బనిచి తుదకు బ్రసన్నమగుము ॥ ప్రభువా ॥ 3. పని పాటలో మేమీ- దినము నీకే మహిమ నొనగూర్చ నడిపించుమో- దేవా నిన్నే-ఘన పరచన్నడిపించుము= తనువు శ్రమచే బడలి నను మా దారి దుర్గమమైన కనంబడ - వనటజెందక నేది చేసిన- బ్రభువు కొఱకని చేయ నడుపుము ॥ ప్రభువా ॥ ––మొలతాటి విద్యానందము Prabhuvaa ninnaaraadimpanu jeritimi yudaya shubhakaanti prabhavimpagaa Devaa nedu shubhakaanti virajimmagaa vibha...

Vendeda Naadagu Vinathini | వేడెద నాదగు వినతిని | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.45 - ప్రాతఃకాల ప్రస్తుతి వేడెద నాదగు వినతిని గైగొన-వే జగదీశ ప్రభో= నేడు ప్రతి క్షణ మెడబాయక నా-తోడ నుండవె ప్రభో ॥ వేడెద ॥ 1. ప్రాతః స్తవము భవత్సన్నిధి స-ర్వంబున నగు నాదౌ= చేతస్సున ధర్మాత్మను సంస్థితి- జేయవే సత్కృపను ॥ వేడెద ॥ 2. నేపాతకి నజ్ఞానుడప్రభువా -నీవు కరుణజేయు= పాపాచరణము నందున జిత్తము-బాపుము నాకెపుడు ॥ వేడెద ॥ 3. పాపముగని భీతుడనై శంకా -పరత సతమునుండన్= నాపై నుంచుము నీదగు సత్కరు-ణా దృష్టిని బ్రేమన్ ॥ వేడెద ॥ 4. నాదగు పాప భరంబంతయు నీ- మీదనే యిడుచుందున్= నీదు మహాకృప నుండి యొసంగుము- నిర్మల గతి నాకున్ ॥ వేడెద ॥ 5. అవిరత మతి నిటుల లతులిత గతి నీ-స్తుతి నుతు లొనరింతున్= భవదంఘ్రులపై నాదగు భక్తిని-బ్రబలింపవే యేసు ॥ వేడెద ॥ ––విలియం డాసన్ Veendeda naadagu vinathini gaikona-ve jagadeesha prabho= Nedu prathi kshana medabaayaka naa-toda nundave prabho || Veededa || 1. Praatha stavamu bhavathsannidhi sa-rvambuna nagu naadau= Chethasssuna dharmathману sansthithi- jeeyave sathkrupanu || Veededa || 2. Neepaataki najnaa...

Sakala Jagajjaala Karthaa | సకల జగజ్జాల కర్తా | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.44 - ఉదయారాధన సకల జగజ్జాల కర్తా- భక్త- సంఘ హృదయ తాప హర్తా=యక లంక గుణమణి-నికర పేటీ కృత-ప్రకట లోకచయ-పరమదయాలయ ॥ సకల ॥ 1. నాదు నెమ్మది తొలంగించుచుంట బ్రతి-వాదు లీమెయి నెంతో పాదుకొన్నారు= బాధ లందైనను- సాధులబ్రోవ న-నాది యైనట్టి నీ వాధారమై యుండ ॥ సకల ॥ 2. దిన కృత్యముల గష్ట మంత-చీక-టిని నే నీ కడభక్తి-మనవి జేయ= వినుచు నా కష్టము-వెస నష్టముగజేయ-ఘనముగ నాయందు గరుణ జేసితివి ॥ సకల ॥ 3. తమ కాపు నన్ను కాపాడగ- నేను-త్తమ నిద్రబొందితి-దనివి దీరం=కొమ రొప్ప మేల్కొన్న- గూలిన మృత్యు భ-యము బొంద నా డెంద -మందు నెల్లప్పుడు ॥ సకల ॥ 4. రాతిరి సుఖనిద్ర జెందంజేసి-రక్షింప నను నీకె-చెల్లు-ప్రాతః స్తుతుల్ జేయ = బగలు-జూచు తెల్వి- ఖ్యాతముగా నాకు- గలుగండేసితివి ॥ సకల ॥ ––విలియం డాసన్ Sakala jagajjaala karthaa- bhaktha- sangha hrudaya thaapa harthaa=yaka Lanka gunamani-nikara petee krutha-prakata lokachaya-paramadayaalaya || Sakala || 1. Naadu nemmadi tholanginchuchu ntabrati-vaadu leemeyi nentho Paadukonnaaru= baadha landainanu- saadhulabova na-naad...

Shree Yesu Kartanu Seevajeyutaku | శ్రీ యేసు కర్తను సేవజేయుటకు | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.43 - ప్రాతఃకాల స్తుతి శ్రీ యేసు కర్తను-సేవజేయుటకు మేల్కొను- శ్రీయేసు కర్తను= శ్రేయముల నెఱింగి=నీకు= రేయిపవ లొసంగి - యెడ - బాయని యంత రంగి-య-పాయంబుద్రోయ స-హాయంబుజేయ ॥ శ్రీ యేసు ॥ 1. నిదుర యందు నేడు -క్షేమ మొదవగాచినాడు -సూర్యుడుదయ మాయెంజూడు - నీ హృదయమున సదమల -పదవు లుదయింప ॥ శ్రీ యేసు ॥ 2. అంధకార మణగెన్- హృద- యాంధకార మణగన్- ప్రభు- నందు దెలివి గలుగన్ ని-బంధనలు డెందమున- కందముగగూర్చి ॥ శ్రీ యేసు ॥ 3. కంటిపాప వలెను-నిను-గాయు వాని దయను-గనుగొంటివి స్తోత్రమును-జేయు-మింటికిని మంటి క-న్నింటికి కర్త యని ॥ శ్రీ యేసు ॥ 4. కలకల ధ్వనిజేయు-పక్కి-గములు లయను గూయు-స్వర-ములు ప్రభు స్తుతిజేయు -నీ-వలయక సొలయక-వెలయగ బాడు ॥ శ్రీ యేసు ॥ 5. సేవయందు నీకు-మంచి-యీవు లిడు పరాకు-గల-భావముబడ బోకు-నేడు-కావవే-కావవే కావవే యంచు ॥ శ్రీ యేసు ॥ 6. పగటి వారమంచు-ని ష్పలపు గ్రియలు ద్రుంచు యుగ యుగములు జీవించు-పురి-కెగయ నీ దిగులు విడు-తగు నమ్మకమున ॥ శ్రీ యేసు ॥ 7. మింటి నట బాడు- నీ-యొంటి బలిమి నేడు-ప్రభు నంటియుండ వాడు ని-న్నొంటి నెన్నంటి కె-న్నింటికి స్వీడడు ॥ శ్రీ యేసు ॥...

Tellavaarinaa Vela | తెల్లవారిన వేళ | Andhra Kraistava Keerthanalu | Telugu Christian Song Lyrics

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.42 - ప్రాతః స్తవము తెల్లవారిన వేళ -దెలి వొంది మన క్రీస్తు -దివ్య నామమంబాడరే- యో ప్రియులారా-దివస రక్షణ వేండరే=తల్లి రొమ్మున దాచు-పిల్ల రీతిని మనల-జల్లదనముగ రాతి-రెల్లగాచిన విభుని ॥ దెల్లవారిన వేళ ॥ 1. నిద్రయిన వేళ - నిపోలాపదలబాపి-నిశ లన్ని గడుపు విభునిన్= భద్రముగ వినతించి- భయభక్తితో మనము-ముద్రి తాక్షులంగేలు- మోడ్చి మొక్కుచును ॥ దెల్లవారిన వేళ ॥ 2. భానుడుదయం బయ్యె-బద్మములు వికసిల్లె- గానములు జేసెంబక్షుల్=మానసాబ్జము లలర-మనము కల్వరి మెట్ట-పై నెక్కు నినుడనెడి-ప్రభుని జూచి వేండ్మన్ ॥ దెల్లవారిన వేళ ॥ 3. దిట్టముగ ఆ మానేసం-ద్రియ కాయ శోధనలు-పట్టుకొని యుందు దినమున=దట్టముగ మన నాల్గు-తల్ల యేసుని కరుణ-జుట్టుకొని రక్షించు-శుభ మడుగుకొనుచున్ ॥ దెల్లవారిన వేళ ॥ 4. పాపభారము మనము-ప్రభుని పై నిడి గురుని-పాదముల చెంత నారగి= కాచు కర్త విశాల- కరము మాటున డాగి -యాపదలం దోలగించు-మని వేండుకొనుచున్ ॥ దెల్లవారిన వేళ ॥ ––పురుషోత్తమ చౌధరి Tellavaarinaa veela -deli vondi mana Kreesthu -divya naamambaadare- Yo priyulaaraa-divasa rakshana veendaree=t...

Meelukona Re Mee Manambula | మేలుకొనరే మీ మనంబుల | Andhra Kraistava Keerthanalu

Image
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు Song No.41 - ప్రాతః కాల కీర్తన మేలుకొనరే- మీ మనంబుల- మేలిమిగ మీ మేరదప్పక-పాలు మాలక లేచి దేవుని-పాదములు పూజింప గ్రక్కున ॥ మేలుకొనరే ॥ 1. దిక్కు లెల్లను దేజరిల్లెను- దినకరుడుదయింపనయ్యెను= మొక్కు లకు ప్రతిఫలము నిచ్చెడు-మూల కర్తకు గొలువ సేయగ ॥ మేలుకొనరే ॥ 2. పక్షు లెల్లను కిలకిలంచును-బ్రభుని మహిమలు బల్కదొడగెను= రక్షకుని సకలోపకృతులను-రమ్యముగ నుతియించి పాడగ ॥ మేలుకొనరే ॥ 3. నిదురబోయిన వేళ మిమ్మొక- నిముషమైనను బాసియుండక= పదిలముగ రక్షించు దేవుని-బ్రస్తుతింప మహాముదంబున ॥ మేలుకొనరే ॥ 4. మేటియౌ హృదయాబ్జములలో-మీ కృతజ్ఞతా భూషణంబులు= నేటుగా ధరియించుకొని యిటు-నిర్మలాత్మని బూజసేయగ ॥ మేలుకొనరే ॥ 5. తెల్లవారగ దెలియరే యిది- తెలివిగల మానవ సమాజము= యుల్ల సిల్లుచు నీతి భాస్కరు-డుదయ మయ్యెను హృదయములపై ॥ మేలుకొనరే ॥ ––మిక్కిలి సమూయేలు Meelukona re- mee manambula- meelimiga mee meeradappaka-paalu Maalaka leechi deevuni-paadamulu poojimpa grakkuna || Meelukonaree || 1. Dikku lellanu deejarilleenu- dinakaruDudayimpanayyenu= mokku Laku prathiphala...